హీరో రానా నటించిన సినిమాలు తక్కువే అయినా అవి పెద్దగా విజయం సాధించకపోయినా రానా కు టాలీవుడ్ బాలీవుడ్ లలో  మంచి ఇమేజ్ ఉంది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘బాహుబలి’ సినిమాలో ప్రతి నాయకుడిగా నటిస్తూ హీరో ఇమేజ్ ను ఎంజాయ్ చేస్తున్న నటుడు రానా. మంచి పర్సనాలిటి ఉన్న రానా ను చూస్తే ఇష్టపడని హీరోయిన్స్ ఉండరు. అందుకే కాబోలు చాలా మంది హీరోయిన్స్ తో రానా ను లింక్ చేస్తూ తరుచూ మీడియాలో వార్తలు వస్తూనే ఉంటాయి.

 అటువంటి రానా అమ్మాయిల కోసం నెలకు 10 లక్షలు రూపాయలు ఖర్చు పెడుతున్నాడట. ఇది ఎవరో అన్న మాట కాదు. ప్రముఖ కమెడియన్ బ్రహ్మనందం అన్న మాటలు. ఆశ్చర్యంగా ఉన్నది కదూ, బ్రహ్మి ఈ మాటలు అన్నది బయట కాదు ఒక సినిమాలో గత వారం సిద్దార్డ్ హీరోగా వచ్చిన ‘సంధింగ్ సంధింగ్’ సినిమాలో బ్రహ్మి లవ్ గురువు గా ప్రేమికులందరికీ వారి ప్రేమ విషయంలో సలహాలు ఇస్తూ డబ్బులు తీసుకుంటూ ఉంటాడు, ఈ సినిమాలోని ఒక సన్నివేశంలో తన దగ్గరకు వచ్చిన హీరో సిద్దర్దాతో మాట్లాడుతూ హీరో రానా కూడా అమ్మాయిలని ఎలా పడెయ్యాలి అన్న విషయం పై తన దగ్గర లవ్ టిప్స్ తీసుకుని నెలకు తనకు 10 లక్షలు ఇస్తూ ఉంటాడని అంటాడు.

ఈ డైలాగ్ విన్న ప్రేక్షకులకు కేవలం ఈ సన్నివేసం కోసం సరదాకు రానా పేరు వాడారా లేదా నిజంగానే రానా అమ్మాయిల పై ఖర్చు పెడుతూ ఉంటాడ అన్న సందేహం కలుగుతుంది. అదీకాక రానా త్రిషలు తరుచూ పబ్స్ లోనూ, పెద్దపెద్ద హోటల్స్ లోనూ కలిసి తిరిగే వార్తలు మీడియాలో వస్తూ ఉంటాయి కాబట్టి బ్రహ్మి కొట్టిన డైలాగ్ నిజమేనా? అనే భ్రమ లోకి ప్రేక్షకులు వెళతారు....

 

మరింత సమాచారం తెలుసుకోండి: