మహేశ్ బాబు, పూరీ జగన్నాథ్ ఏ క్షణాన ‘బిజినెస్ మ్యాన్’ కోసం ముంబాయిని ఉచ్చ పోయిస్తా అనే లైన్ రాశారో గాని ఇప్పుడు అదే లైన్ చాలా మందికి జీవం పోస్తోంది. తాజాగా మార్కెట్టులో దిగిన సంపూర్ణేష్ బాబు, సోషల్ మీడియా పుణ్యమాని ఇప్పుడు ఓ హీరో రెంజుకి ఎదిగిపోయాడు. హీరోగా ఇంతవరకూ ఇంట్రడక్షన్ ఇవ్వకుండానే ఇంత ఎత్తు ఎదిగితే రేపు ‘హృదయ కాలేయం’ సినిమా రిలీజయితే ఇక మన దయనీయ స్థితి ఎవరితో చెప్పుకుంటామో?
 
సినిమా విడుదలకు ముందు అందరిలాగే మనాడు ఓ టీజర్ యూట్యూబులో వదిలాడు. స్టీవెన్ శంకర్, సంపూర్ణేష్ బాబులో ఎంత కళాపోషణ ఉందో ఇందులోని ఒక్క డైలాగ్ వింటే ఇట్టే అర్థమవుతుంది. బర్నింగ్ స్టార్ అని తనకు తానే ఓ టైటిల్ తగిలించుకొని ఆంధ్రా మొత్తాన్ని బర్న్ చేయడానికి వస్తున్న సంపూ బాబు డైలాగ్ ఇదిగో.
 
‘నేను నరికితే ముక్కలు ఏరుకోవడానికి ప్రొక్లేనర్లు రావాలి, రక్తం ఎరులై పారేందుకు డ్రైనేజీలు తవ్వాలి...నేనంటే ఉచ్చ పోసుకోవాలి. పోయిస్తా...ఈ చేత్తో పోయిస్తా.’

మరింత సమాచారం తెలుసుకోండి: