బాలీవుడ్ సినిమా మొదలై వంద సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంలో బాలీవుడ్ లో ఒక విచిత్రం జరుగుతోంది. ఎప్పుడో తీసి దుమ్ము పట్టి పోయిన సినిమా నేడు వెలుగు చూస్తోంది. సినిమా ఇండస్ట్రీలో ఏదైనా సినిమా  తీయాలంటే  నెలలు పడుతుంది, ఇంకా అయితే సంవత్సరాలు  కూడా పడుతుంది. ఇక దశాబ్దాలు  కూడా దాటితే మాత్రం ఇక ఆ సినిమాను మర్చిపోవాల్సిందే. ఒక్కసారి ఎన్నో కారణాలతో కొన్ని సినిమాలు చిత్రీకరణ పూర్తయినా కాని విడుదలకు నోచుకోవు.

దశాబ్దాలు దాటిన సినిమాలు ఆ సినిమా మరుగున పడడమే జరుగుతుంది. అయితే ఇప్పుడు బాలీవుడ్ లో నాలుగు దశాబ్దాల ముందు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఓ సినిమాకు మోక్షం కలుగుతోంది. హిందీ నటుడు, దర్శకుడు జాయ్ ముఖర్జీ నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం 'లవ్ ఇన్ బాంబే'. అశోక్ కుమార్, కిషోర్ కుమార్, వహీదా రెహమాన్ నటించిన ఈ సినిమా నలభై సంవత్సరాల క్రితమే పూర్తయింది. అయితే, అప్పట్లో ఈ సినిమా ఎందుకు విడుదల కాలేదనేది తీసిన జాయ్ కి తప్ప ఎవ్వరికీ తెలియదట. అయితే ఇప్పుడు ఈ సినిమాను జాయ్ పెద్ద కొడుకు మోనో జాయ్ ముఖర్జీ విడుదల చేస్తున్నారు.
 

దీనిపై స్పందించిన మోనో ఈ  సినిమా అప్పుడు ఎందుకు విడుదల చేయలేదో కారణాలు తెలియవు కాని, ఇప్పుడు ఈ ప్రింట్ వెతకడానికి చాలా టైం పట్టిందని, త్వరలోనే విడుదల చేస్తామని చెపుతున్నాడు. సినిమా రంగం అంటేనే ఒక సెన్సేషన్ నాలుగు దశాబ్దాలు మరుగు పడిపోయిన సినిమా ఇప్పుడు వెలుగు చూడటం ఆశ్చర్యంతో పాటు అద్భుతమే.....

 

మరింత సమాచారం తెలుసుకోండి: