నటించిన రెండవ సినిమాతోనే అందరినీ ఆకర్షించిన తెలుగమ్మాయి నందిత తానేమిటో ‘ప్రేమ కధా చిత్రమ్’ ద్వారా నిరూపించుకుంది. ఈ సినిమాలో   హీరో  సుధీర్‌ వెంటపడే డేరింగ్‌ లవర్‌గా, దెయ్యం ఆవహించిన చంద్రముఖిలా డిఫరెంట్‌ యాంగిల్స్ లో కనిపించిన  నందిత  ..స్వతహాగానే డేరింగ్‌గా ఉండడానికి కారణం ఉంది. నందిత తల్లి తండ్రులది ఆర్మీ నేపధ్యంగల కుటుంబం. తండ్రి ఆర్మీ ఆఫీసర్ చిన్న తనం నుండి తన తండ్రితో ఇండియా అంతా తిరగడంతో నందిత కు చాలా భాషలు వచ్చు. అంతేకాదు ఇంగ్లీష్, హిందీ, తెలుగు అనర్గళంగా మాట్లాడుతుంది నందిత. చిన్న తనం నుండి ఆర్మీ వాతావరణం వల్ల చాలా ఫాస్ట్ గా ఉంటుంది.

అంతేకాదు తన మాటలతో ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. ఈ లక్షణమే నందిత కు ప్లస్ పాయింట్ గా మారి దర్శకనిర్మాతలను ఆకర్షించడానికి ఉపయోగపడుతున్నాయి అని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితులలో హీరోయిన్స్ అంటే ఎటువంటి సన్నివేసాలలో నటించడానికైనా కధను బట్టీ సన్నివేశాలకు  అనుగుణంగా ఎక్స్ పోజ్ చేయడానికి రెడీ అనాలి ఈ రెండు లక్షణాలు నందిత కు పుష్కలంగా ఉన్నాయి.

ఇటువంటి ఆర్మీ కుటుంబ నేపధ్యo నుంచి వచ్చిన బాలీవుడ్ హీరోయిన్స్ లారా దత్తా, ప్రేతి జింతాలు బాలీవుడ్ ను ఏలారో అందరికీ తెలిసిన విషయమే. అందంతో పాటు అభినయం కూడా ఉన్న నందిత రాబోయే కాలంలో టాప్ హీరోయిన్ అయ్యే అవకాశం ఉందని అందువల్ల నందిత తన పాత్రల ఎంపికలో తెలివిగా వ్యవహరిస్తే భవిష్యత్ ఆమెదే అని అంటున్నారు. మరికొంతమంది అయితే నందిత లో నిత్యామీనన్ పోలికలు పుష్కలంగా కని పిస్తున్నాయి అంటున్నారు. అంతేకాదు చాలా కాలం తరువాత గ్లామరస్ గా కనిపించే తెలుగమ్మాయి దొరికింది అంటున్నారు. ఎదిఎమైనాప్రస్తుతం యూత్ లో నందిత హవా నడుస్తోంది.....  

మరింత సమాచారం తెలుసుకోండి: