పవన్ నటిస్తున్న ‘అత్తారింటికి దారేది’ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే పవన్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన అభిమానులను ఎప్పటి నుంచో ఊరిస్తున్న ‘గబ్బర్ సింగ్2’ నిర్మాణం వైపు అడుగులు వేస్తున్నాడు. ఈ సినిమాకు సంబందిచిన మొత్తం స్క్రిప్ట్ వర్క్ పూర్తీ అయి ఒక్క హీరోయిన్ పాత్ర ఎంపిక మాత్రమే మిగిలింది.

రకరకాల పేర్లను పరిశీలించిన తరువాత ఈ సినిమాకు పవన్ హీరోయిన్ గా ఒక బాలీవుడ్ తారను ఎంపిక చేస్తున్నట్లు లేటెస్ట్ సమాచారం. గబ్బర్ సింగ్ సినిమాకు పనిచేసిన సాంకేతిక నిపుణులంతా ఈ సినిమాకు పనిచేస్తున్నారు. అయితే ఈ సినిమా సీక్వేలా? ప్రీక్వెలా? అంటూ మీడియాలో వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈ సినిమాను సీక్వెల్ గా పవన్ తయారుచేయలేదని, ఒక్క పవర్ స్టార్ పాత్ర మినహా ‘గబ్బర్ సింగ్’ సినిమాకు, ఈ సినిమాకూ ఎక్కడా పోలిక ఉండదనీ లేటెస్ట్ న్యూస్ .

 పవన్ కళ్యాణ్ తను సొంతంగా రాసుకున్న ఈ కధ చాలా డిఫరెంట్ గా వచ్చిందట. పవన్ క్రియేటివ్ ఆర్ట్స్ అనే నూతన నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో పవన్ కు అత్యంత సన్నిహితుడు శరత్ మరార్ ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.....

మరింత సమాచారం తెలుసుకోండి: