నేనే సంపూ - ముద్దు పేరూ తెగింపూ అంటూ తెగ అద‌ర‌గొట్టేశాడు సంపూర్లేష్ బాబు. హృద‌య‌కాలేయం పోస్ట‌ర్ల‌తో ఫేస్‌బుక్‌ల‌లోనూ, యూట్యూబ్‌ల‌లోనూ సంద‌డి చేశాడు.. సంపూ. సంపూ అవ‌తారం చూసి జ‌నాల గుండెలు గుభేలు మ‌న్నా - సినిమా హీరో అయిపోవాల‌నే అత‌ని తెగింపు చూసి ముచ్చ‌ట ప‌డ్డారు. పైగా హృద‌య‌కాలేయం అనే టైటిలూ,

అత‌ని హీరో పోజు చూసి వీడి సంగ‌తేంటో చూద్దాం అని టైమ్‌పాస్ చేశారు. దాంతో ఈ సినిమాకి బీభ‌త్స‌మైన ప‌బ్లిసిటీ ప్రీగా వ‌చ్చిప‌డిపోయింది. దాంతో సంపూ బాబులో కాన్ఫిడెన్స్ పెరిగింది. హృద‌య‌కాలేయం టీజ‌ర్‌ని యూ ట్యూబ్‌లో విడుద‌ల చేసేశాడు. దానికి వ‌స్తున్న స్పంద‌న అంద‌రినీ తెగ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. ఈ టీజర్ విడుద‌లైన తొలి రోజే 50 వేల క్లిక్స్ వ‌చ్చాయి. సంపూని తెలియ‌కుండానే జ‌నాలు అభిమానిస్తున్నారు అని చెప్ప‌డానికి ఇది ఓ నిద‌ర్శ‌న‌మే. లేదంటే ఓ ఊరూ,

పేరూ లేని సినిమాకి ఒక్క రోజులో 50 వేల క్లిక్స్ రావ‌డం ఏమిటి?  విడ్డూరం కాక‌పోతే. పైగా ఆ టీజ‌ర్ కూడా మన హీరోల‌పై సెటైర్ వేస్తున్న‌ట్టు స‌ర‌దాగా ఉంది. అన్న‌ట్టు సంపూ బాబుకి ఓ బిరుదు కూడా ఉందండోయ్‌. బ‌ర్నింగ్ స్టార్ అట‌. ఈ బ‌ర్నింగ్ స్టార్ టీజ‌ర్ల‌లో పంచ్ డైలాగుల‌తో తెగ చంపేశాడు. సినిమా నిండా ఇలాంటి జోకులేన‌ట‌. ఈ హ‌వా ఇలాగే కొన‌సాగితే - సంపూకి నిజంగానే అంత క్రేజ్ వచ్చేస్తుందేమో?

మరింత సమాచారం తెలుసుకోండి: