త‌క్కువ డ‌బ్బుల‌తో సినిమా చేసి ఎక్కువ సంపాదించుకోవ‌డం ఎలాగో వ‌ర్మ‌ని అడిగి తెలుసుకోవాలి. టెక్నిక‌ల్‌గా వ‌ర్మ సినిమాలు గొప్ప‌గా ఉంటాయి అనే భ్ర‌మ త‌ప్పితే.. ఆ క్వాలిటీ వ‌ర్మ సినిమాల్లో ఎప్పుడో పోయింది. 5డీ కెమెరా వ‌చ్చాక‌.. వర్మ దానితో ఎన్నో ప్ర‌యోగాలు చేస్తున్నాడు. మ‌నం చూడాలే గానీ సెల్‌ఫోన్‌లో ఉండే కెమెరాతోనూ సినిమాతీసి వ‌దిలేయ‌గ‌ల నేర్ప‌రి. ఇప్పుడు అదే 5డీ టెక్నాల‌జీతో...

ఓ చిన్న సినిమా పూర్తి చేశాడు. అదే సైకో.కిషోర్ భార్గ‌వ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా సైకో. దీనికి వ‌ర్మ క‌థ, స్ర్కీన్‌ప్లే అందించాడు. ఈ చిత్రాన్ని ఈనెల 21న విడుద‌ల చేస్తున్నారు. ఇది కూడా 5డీలో తీసిన సినిమానే. కేవ‌లం రూ 60 ల‌క్ష‌ల‌తో తీసిన సినిమా అట‌. దాదాపు అన్ని భాష‌ల్లో క‌లిసి ఆరు కోట్ల బిజినెస్ అయినా చేసేసి ఉంటాడు వ‌ర్మ‌. ఎంత‌లో తీస్తే, ఎంత లాభ‌మో చూశారా?  

తీసింది సైకో సినిమా అయినా - త‌న మేధావిత‌నం నిరూపించుకొన్నాడు వ‌ర్మ‌.అన్న‌ట్టు ఓ కొస‌మెరుపు ఏమిటంటే ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంద‌ట‌. అమ్మాయిలు సైకోలుగా మారితే ఎలా ఉంటుందో చూపిస్తాడ‌ట‌..  ఇలాంటి సినిమాలు తీసుకొంటూ పోతే.. వ‌ర్మ‌ని ద‌ర్శ‌క సైకో అన్నా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: