బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన సింహాలోని ఒకవైపే చూడు, రెండో వైపు చూడొద్దు డైలాగ్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే . కానీదర్శకుడు బోయపాటి ఇంకా ఆ డైలాగు మాయలో నుండి బయటికి రాలేదనడానికి ఈ మధ్య ఆయనకు అవకాశాలు లేకపోవడాన్నే ఉదాహరణగా తీసుకోవచ్చు. 
 

పై డైలాగు ఉన్న సింహా మూవీలో బోయపాటి బురదజాతి, బ్లడీ ఫూల్స్ వగైరా పదాలు వాడి సినిమా ఇండస్ట్రీలో కొందరి హీరోలపై సెటైర్లు వేయించాడు. అలాగే ఎన్టీఆర్ తో చేసిన దమ్ములో కూడా కాంట్రవర్సీ డైలాగ్స్ ఒక వర్గాన్ని టార్గెట్ చేసినట్లే ఉంటాయి. ఈ విధమైన నడవడిక ఉంటే బోయపాటికి సినిమా అవకాశాలు ఎలా వస్తాయి. తాజాగా మళ్ళీ బాలయ్యతో చేస్తున్న మూవీలో కూడా ఒక వైపే చూస్తూ ఈసారి డైరెక్టుగా ఓ మెగా హీరోని టార్గెట్ చేసినట్లుగా, ఈ మూవీ కి సంబందించిన కొన్ని లీకైన  డైలాగ్స్ చెబుతున్నాయి. 
 

డైరెక్టర్ అనే వాడు సృష్టించాల్సిన వాతావరణం అయితే ఇది మాత్రం కాదు. డైరెక్టర్ అనే వాడు అందరిని కలుపుకుని పోవాలి తప్ప కెలుక్కుంటూ కాదు. అయిన ఈ  ఒక్క మూవీతో సినిమాలు ఆగవు కదా! మరెందుకు బోయపాటి రెండు వైపులా చూడకుండా పోతావు. డైలాగ్స్ నీకంటే పవర్ ఫుల్ గా, నీమీదే రాయగల స్టామినా నీవు ఎక్కుపెట్టిన వారిలో కూడా ఉంటుంది. అది కూడా గమనిస్తే నీకు కూడా కొన్ని మంచి డైలాగులువస్తాయి. సో.. ఇకనైనా కాస్త రెండో వైపు చూడటం స్టార్ట్ చెయ్ బోయపాటి.

మరింత సమాచారం తెలుసుకోండి: