పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ డైరెక్షన్లో చేస్తున్న'అత్తారింటికి దారేది' మూవీ గురించి తాజాగా ఓ న్యూస్ బయట సంచలనం సృష్టిస్తుంది. పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ కోసం 2 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని, పవన్ హెలికాఫ్టర్లో ఎంట్రీ ఇచ్చి విలన్లతో ఫైట్ చేస్తాడని తాజాగా వినిపిస్తుంది. 
 

అయితే ఈ విషయం తెలిసిన మెగా ఫాన్స్ అందరూ ఇదేదో కొమరం పులి చిత్రాన్ని సూచిస్తుందని భయపడుతున్నారు. పులి చిత్రంలో కూడా యస్ జె సూర్య, పవన్ చేత ఇలానే చేయించి ఆ సినిమా పరాజయంకి ఇంట్రడక్షన్ సీనుతోనే నాంది పలికాడు. మళ్ళీ అలానే ఎంట్రీ అంటే నిజంగానే భయం వేస్తుంది మరి! అయినా ఆ టైటిల్ ఏంటి? ఈ ఇంట్రడక్షన్ ఏంటి? 
 

అత్తారింటికి దారేది చాలా సాఫ్ట్ టైటిల్. పైన చెప్పిన సీనుకి, ఈ టైటిల్ కి ఏమైనా సంబంధం  ఉందనిపిస్తుందా? బాలు సినిమా ఆడకపోయినా, అదే  టైపులో ఉన్న కథతో పంజా సినిమా చేసిన పవన్, నిండా  మునిగానని తెలుసుకుని కూడా మళ్ళీ ఇటువంటి ప్రయోగాలు చేయడం అవసరమా?ఆల్రెడీ పులితో అయ్యిందిగా మళ్ళీ ఎందుకు అంటూ పవన్ బాబుకి ఫాన్స్ ఒక వైపు క్లాస్ పీకుతున్నా, మరో వైపు త్రివిక్రమ్ ఉన్నాడులే అని వారిలో వారే సర్దిచేప్పుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: