1990  ప్రాంతాలలో వచ్చిన నాగార్జున హలో బ్రదర్ అప్పట్లో ఒక సెన్సేషన్ . ఇప్పుడు మళ్ళి అదే సినిమాను అదే పేరుతో  నాగ చైతన్య హీరో గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే .ఆ సినిమా లోని కన్నెపెట్టరో కన్నుకొట్టరో..’ 90లలో యూత్‌ని రఫ్ ఆడించిన పాట ఇది. కింగ్‌ నాగార్జున కెరియర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌.  అప్పట్లో  ఆ పాట అంతగా ఫేమస్‌ అవ్వడానికి కారణం బాలు గాత్రం, కీరవాణి మ్యూజిక్‌ ఓ కారణం.  అంతకుమించి ఈ ముగ్గురు కన్నెపెట్టలు చేసిన రభస.  రంభ, ఆమని, ఇంద్రజ లాంటి అలనాటి   సెక్సీ ముద్దుగుమ్మలు నాగ్‌తో కలిసి తమ అందాలను ఆరబోస్తూ అద్దిరిపోయే స్టెప్పులేయడంతో ఆనాటి   యువత థియేటర్స్ లో డాన్స్ లు చేసింది.  

ఇప్పుడదే పాటను నాగచైతన్య హీరోగా వస్తున్న ‘హలోబబ్రదర్‌’ రీమేక్‌లో రీమిక్స్‌ చేస్తున్నారు. ఈ రీమిక్సులో ముదురు కన్నెపెట్టలు శ్రీయ, ప్రియమణి,ఛార్మి లతో కలసి  చైతు స్టెప్స్ వేస్తాడట . ఇప్పటికే కలిసి ఛార్మి కూడా చైతూ కోసం స్టెప్పేస్తుందిట. మొదటి ఇద్దరు భామలు ఇప్పటికే ఈ ముగ్గురు ముదురు  హీరోయిన్ లు బుకింగ్ లు లేక ఐటమ్ భామలుగా మారిపోయారు. ఆన్ స్క్రీన్ ఇంకా చిన్న వాడిగా కనిపించే నాగ చైతన్య ఈ ముదురు భామల మధ్య ఐటమ్ సాంగ్ కు నప్పుతాడా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

 డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి ఈ సూపర్ హిట్ పాటను రీమిక్స్ చేసి ఎలా చూపెడతాడో అనే ఆ శక్తి అక్కినేని అభిమానులలో రోజురోజుకి పెరిగిపోతోంది. ఈ ముదురు పెట్టలతో చైతూ ఎలా వేగుతాడో చూడాలి....

మరింత సమాచారం తెలుసుకోండి: