పాజిటివ్ టైటిళ్లు పెట్ట‌డం అంటే పూరి జ‌గన్నాథ్‌కి అంత‌గా ఇష్టం ఉండ‌దేమో. పోకిరి, ఇడియ‌ట్‌, దేశ‌ముదురు అంటూ.. తిట్టూ శాప‌నార్థాలే సినిమా టైటిళ్లుగా పెట్టేస్తాడు. అవి హిట్ అవుతూ వ‌చ్చాయి. దాంతో ఆ సెంటిమెంట్‌ని అలాగే కొన‌సాగించాడు. రాముడు మంచి బాలుడు టైప్‌లో టైటిళ్లు పెడితే ఈనాటి కుర్రాకారు సినిమాలు చూడ‌రు అనేది పూరి అభిప్రాయం.

ఇప్పుడు దాన్ని మార్చుకొన్నాడేమో అనిపిస్తోంది. ఎందుకంటే త‌న కొత్త సినిమాకి అంద‌గాడు అనే టైటిల్ పెట్ట‌బోతున్నాడు పూరి.నాగ‌బాబు కుమారుడు వ‌రుణ్‌తేజ్‌- పూరి జ‌గ‌న్నాథ్ క‌లయిక‌లో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. జులై మొద‌టి వారంలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. దీనికి అంద‌గాడు అనే టైటిల్ పెడితే ఎలా ఉంటుంది? అని పూరి తెగ ఆలోచిస్తున్నాడ‌ట‌. వైష్ణో అకాడ‌మీ బ్యాన‌ర్ పై ఈ టైటిల్‌ని రిజిస్ట‌ర్ కూడా చేయించార‌ట‌. ప్ర‌స్తుతం క‌థ

వండుతున్నారు. పూరికి క‌థ తయారు చేయ‌డం ఎంత సేపు??  ముందు టైటిల్ పుడితే, క‌థ ఆటోమెటిగ్గా వ‌చ్చేస్తుంద‌నేది ఆయ‌న పీలింగ్‌. అందుకే.. టైటిల్‌ని ఫైన‌లైజ్ చేయ‌డంలో పూరి త‌ల మున‌క‌లై ఉన్నాడు. టీమ్ అంద‌రికీ అంద‌గాడు టైటిల్ న‌చ్చింది. అదే గ‌నుక సెట్ చేస్తే.. పూరి పెడుతున్న ఫ‌స్ట్ పాజిటీవ్ టైటిల్ ఇదే.

మరింత సమాచారం తెలుసుకోండి: