మ‌సాలా, బూతు ఇవన్నీ ద‌ట్టించి సినిమాలు తీయ‌డం ఎలాగో బాగానే నేర్చుకొన్నాడు మారుతి. ఒక ప్రేమ క‌థా చిత్ర‌మ్‌లో బూతుల హ‌వా కాస్త త‌గ్గింది కానీ, పూర్తిగా వ‌ద‌ల్లేదు. ఇది బాగా లాభ‌సాటి వ్యాప‌రంగా మారింది అత‌నికి. నిర్మాత‌గానూ ఇలాంటి ప్రయ‌త్నాలు చేస్తున్నాడిప్పుడు. మారుతి నిర్మాణంలో రొమాన్స్ అనే చిత్రం తెర‌కెక్కుతోంది. ప్రేమ పేరు చెప్పి ప‌చ్చిగా శృంగార విష‌యాల్ని చ‌ర్చించ‌న‌వాడు,

రొమాన్స్ టైటిల్ పెట్టి ఆగుతాడా?త‌న ద‌గ్గ‌ర పనిచేసిన సహాయ‌కుల‌ను ఓ బృందంగా మార్చి, వారితో సినిమాలు చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడు మారుతి. ఇప్పుడు అత‌ని నిర్మాణంలో మ‌రో రెండు కొత్త చిత్రాలు రూపొంద‌నున్నాయి. వాటికి యూత్ ఫుల్ టైటిళ్లు కూడా పెట్టేశాడు. క‌లలు క‌నే వ‌య‌సు, ట్వంటీ ట్వంటీ.. అనే సినిమాల్ని తీస్తున్నాడిప్పుడు. ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ను త‌న శిష్యుల‌కు అప్ప‌గిస్తాడ‌ట‌. ఇవి కూడా త‌క్కువ బ‌డ్జెట్‌లో తీసేసి,

త‌న పేరుమీద ఎక్కువ రేటుకు అమ్ముకొందామ‌నుకొంటున్నాడు మారుతి. అత‌ని లెక్క‌లు... బాగానే ఉన్నాయి. కానీ బూతు ని న‌మ్ముకొని సినిమాలు తీయాల‌నుకోవ‌డం దిగ‌జారిన త‌న‌మే. మ‌రి ఈ మ‌త్తులోంచి మారుతి ఎప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తాడో?

మరింత సమాచారం తెలుసుకోండి: