క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ స‌న్నివేశం భారీ ఎత్తున ఉండాల్సిందే. పాట‌తోనో, ఫైటుతోనే ఎంట్రీ ఇస్తే ఫ్యాన్స్ ఖుషీ అవుతారు. అత్తారింటికి దారేది సినిమాలో ప‌వ‌న్ కూడా ఇదే ఫార్ములాలో వెళ్తున్నాడు. ఓ ఫైట్ తోఎంట్రీఇవ్వ‌బోతున్నాడు. అయితే అదేం ఆషామాషీగా ఉండ‌ద‌ట‌. చాలా భారీ ఎత్తున తీర్చిదిద్దార‌ట‌. హెలీకాఫ్ట‌ర్‌తో ఛేజింగులు

, బాంబు బ్లాస్టింగులుల‌తో ప‌వ‌న్ ఓపెనింగ్ సీన్ అదిరిపోయే స్థాయిలో ఉంటుంద‌ట‌. దీని కోసం ఏకంగా రూ.2 కోట్లు ఖ‌ర్చుపెట్టార‌ట‌. ఈ పోరాట దృశ్యాల‌ను డిజైన్ చేసిందెవ‌రో కాదు. స్వ‌యంగా ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్. ప్ర‌స్తుతం స్పెయిన్‌లో ఇందుకు సంబంధించిన యాక్ష‌న్ ఘ‌ట్టాలు తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభ స‌న్నివేశాల‌లో వ‌చ్చే ఫైట్ ఇది.

 ఓపెనింగ్ సీన్ ఇంత భారీ ఎత్తున ఉంటే, మ‌రి ప‌తాక స‌న్నివేశాలో...?  అని అభిమానులు అప్పుడే ఆశ‌ల్లో మునిగిపోతున్నారు. ప‌వ‌న్ ఎంట్రీ ఏ స్థాయిలో ఉంటుందో, అభిమానుల్ని ఎంత‌లా ఉర్రూత‌లూగిస్తుందో తెలుసుకోవాలంటే కొంత‌కాలం ఆగాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: