ప‌వ‌న్ ఫైట్ మాస్టర్ గా......

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ళ్లీ పైట్ మాస్టర్ గా మారిపోయాడు. మార్షల్ ఆర్ట్స్ లో పట్టా వున్న ప‌వ‌న్ గ‌తంలో కొన్ని సినిమాల‌కు ఫైట్స్ కూడా కంపోజ్ చేశాడు. ఖుషీలో ఇంట్రడ‌క్షన్ ఫైట్, చిరంజీవి డాడిలో ఓ ఫైట్ ని ప‌వ‌ర్ స్టారే కంపోజ్ చేశాడ‌న్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. అయితే ఈ మ‌ద్య యాక్షన్ కి కాస్త దూరంగా ప‌వ‌న్ ఇపుడు మ‌రోసారి తన విశ్వరూపం చూపించ‌బోతున్నాడ‌ట‌.

జ‌ల్సా కాంబినేష‌న్ లో రూపొందుతున్న అత్తారింటికీ దారేదీ ప్రస్తుతం స్పెయిన్ లో షూటింగ్ జరుపుకుంటోంది. అక్కడే ప‌వ‌న్ పైట్ మాస్టర్ అవ‌తారం ఎత్తాడు. పీట‌ర్ హెయిన్ ఫైట్ మాస్టర్ గా వున్న ఈ సినిమాకు ఇంట్రడక్షన్ ఫైట్ ని ప‌వ‌నే కంపోజ్ చేసుకున్నాడ‌ట‌. పీట‌ర్ హెయిర్ కూడా సూప‌ర్ మీరే చేసేయండి అని చెప్పడంతో ఐదు హెలికాప్టర్లతో స్పెయిన్ లో ఈ యాక్షన్ సీన్ ని చిత్రీక‌రిస్తున్నారు.. విశేషం ఏంటంటే ఈ ఫైట్ కి దాదాపు రెండు కోట్లు ఖ‌ర్చు పెడుతున్నార‌ట‌.
��
అయితే అత్తారింటికీ దారేదీ టైటిల్ కి , ఈ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్ కి సంబంధం ఏంటో అర్దంకాక ఫ్యాన్స్ బ‌య‌ప‌డుతున్నారు. ఎందుకంటే కొమ‌రంపులిలో ఇలాగే హెలికాప్టర్లతో ఇంట్రడ‌క్షన్ ఫైట్ పెట్టారు. సినిమా రిజ‌ల్ట్ అంద‌రికీ తెలిసిందే. అందుకే ఫ్యాన్స్ కాస్త భ‌య‌ప‌డుతున్నారు. అయితే అదంతా త్రివిక్రమ్ చూసుకుంటాడులే అన్న ధీమాను కూడా వ్యక్త ప‌రుస్తున్నారు. స‌రే ఏది ఏమైనా ప‌వ‌న్ మ‌రోసారి స్టంట్స్ కంపోజ్ చే్స్తున్నాడు. మ‌రి ఆ ఫైట్స్  ఏ రేంజ్ లో వుంటాయో చూడాలంటే ఆగ‌స్టు7 దాకా వెయిట్ చేయాల్సిందే. ఎందుకుంటే అత్తారింటికీ దారేదీ రిలీజయ్యేది ఆ రోజే.

మరింత సమాచారం తెలుసుకోండి: