భారీ పారితోషికాలు ఆఫర్ చేసిన మన నిర్మాతలను కనికరించకుండా డేట్స్ లేవని కాసేపు, కధ నచ్చ లేదని కాసేపు చిన్న హీరోల సినిమాలైనా పర్వాలేదు అంటూ రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తూ టాలీవుడ్ నిర్మాతలను గజిబిజి కి గురిచేస్తున్న సమంత సమస్యకు కేధరిన్ రూపంలో ప్రత్యామ్నాయం దొరికినట్లుగా కనిపిస్తోంది. ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కేధరిన్ తన మొదటి సినిమాతోనే అటు టాలీవుడ్ ప్రేక్షకులని ఇటు నిర్మాతలను ఆకర్షించింది. ఈ సినిమా పెద్దగా హిట్ కాకపోయినా ఒకేసారి డైరెక్ట్ ప్రమోషన్ కొట్టేసి కొరటాల శివ దర్శకత్వంలో రామ్ చరణ్ కొత్త సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. అల్లువారి అబ్బాయి సిఫార్సు తో ఈ ఎంపిక జరిగిందని అంటున్నారు.

మొదట ఈ సినిమాలో సమంత మెయిన్ హీరోయిన్ సెకండ్ హీరోయిన్ గా అమలాపాల్ ను అనుకున్నారట. అయితే సమంత నో చెప్పడంతో మెయిన్ హీరోయిన్ పాత్రకు కేధరిన్ హాట్ లుక్స్ సరిగ్గా సరిపోతాయని చెర్రీ కూడా కేధరిన్ కే ఓటు వేసాడట. సమంతకు త్వరలో పెళ్ళి ఐపోతుందని రూమర్స్ రావడం ఆమె వ్యవహార శైలి కూడా గజిబిజిగా ఉండటం తో అందంలో సమంతకు అన్నివిధాల సరి తూగగల హీరోయిన్ గా కేధరిన్ ను టాలీవుడ్ నిర్మాతలు గుర్తిస్తున్నారు .

యాక్షన్ విషయంలో కూడా కేధరిన్ రాణించగలిగితే రాబోయే కాలంలో సమంత లేని లోటును కేధరిన్ తీరిస్తుందని టాలీవుడ్ నిర్మాతలు ఆశపడుతున్నారు. విదేశీ సంస్కృతి నేపధ్యంలో పుట్టిపెరిగిన అమ్మాయి గా కేధరిన్ కు గుర్తింపు ఉంది కాబట్టి హాట్ సీన్స్, ఎక్స్ పోజింగ్ విషయంలో సమంతను మించిపోతుంది ఈ మలయాళీ ముద్దుగుమ్మ....   

మరింత సమాచారం తెలుసుకోండి: