రొటీన్ పాట‌లే ఇచ్చినా, ఊక దంపుడు సంగీతం కొట్టినా త‌మ‌న్‌ని న‌మ్మ‌డం మాన‌లేదు మ‌న హీరోలు, ద‌ర్శ‌కులు. రెడీమెడ్‌గా ఎప్పుడు కావ‌లిస్తే అప్పుడు పాట‌లు ఇచ్చేస్తాడ‌నే న‌మ్మ‌కంతో అంద‌రూ త‌మ‌న్‌ని ఆశ్ర‌యిస్తున్నారు. ఎన్టీఆర్‌, మ‌హేష్‌, ర‌వితేజ ఇలాంటి హీరోలైతే మ‌ళ్లీ మ‌ళ్లీ త‌మ‌న్ పాట‌ల‌నే కోరుకొంటున్నారు. అందుకే...

త‌మ‌న్ స్వ‌ర ప్ర‌యాణం స్పీడుగా సాగిపోతోంది. త్వ‌ర‌లోనే ఆఫ్ సెంచ‌రీ చేయ‌బోతున్నాడు. మ‌హేష్‌బాబు సినిమా ఆగ‌డు.. త‌మ‌న్‌కి సంగీత ద‌ర్శ‌కుడిగా 50వ సినిమా.ప్ర‌తిసారీ త‌మ‌న్ చేతిలో ఐదారు సినిమాలుంటాయి. ట్రెండీ సంగీతం ఇస్తాడ‌నే పేరుంది. కానీ... కిక్‌లా ఆరు పాట‌లూ హిట్ చేసిన దాఖ‌లాలు చాలా త‌క్కువ‌. కాక‌పోతే హిట్ సినిమాల‌కు పనిచేశాడు కాబ‌ట్టి, ఆ ఫాలోయింగ్ అలా కొన‌సాగుతూనే ఉంది.

పైగా పారితోషికం విషయంలోనూ పేచీ పెట్ట‌డట‌. దేవిశ్రీ ప్ర‌సాద్ కి అయితే కోటి ఇవ్వాలి. అదే త‌మ‌న్ అయితే అనుకొన్న బ‌డ్జెట్‌లో పాటల్ని పూర్తి చేస్తాడ‌ట‌. అందుకే అంద‌రూ త‌మ‌న్ నామ‌జపం చేస్తుంటారు.
50 సినిమాల మార్కుని చేరుకోవ‌డం ఓ మైలురాయే. మ‌హేష్ సినిమాతో దాన్ని అందుకొంటున్నాడు త‌మ‌న్‌. మ‌రి ఆ మైలురాయి చిత్రం గుర్తిండిపోయేలా అదిరిపోయే మ్యూజిక్ ఇస్తాడేమో చూడాలి మ‌రి.

మరింత సమాచారం తెలుసుకోండి: