ఈ రోజుల్లో, బ‌స్టాప్ అంటూ అడల్డ్ మూవీస్ చేసి బూతు డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న మారుతి ఈ మ‌ద్య వ‌చ్చిన ప్రేమ‌క‌ధా చిత్రమ్ తో ఆ ఇమేజ్ ని  బ్రేక్ చేశాడు. నిజానికి  ఆ సినిమాకు  మారుతి ద‌ర్శక‌త్వ ప‌ర్యవేక్షణే  అయిన‌ప్పటికీ క్రెడిట్ అంతా అత‌డికే ద‌క్కింది. స‌రే  ఏదైతేనేం ఇపుడు  మారుతి అంటే  టాలీవుడ్ లో  ఓ బ్రాండ్ ఏర్పడింది. దీంతో మారుతి త‌న రూటు మార్చాడ‌ట‌. త‌న మ‌దిలో వున్న బూతు స్ధానంలో ప్రేమ‌నే నింపుతున్నాడ‌ట‌.
��
ఆ ప్రాసెస్ లో భాగంగానే మారుతి ఇపుడు మూడు ప్రేమ‌క‌ధ‌ల‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే రోమాన్స్ అనే సినిమా పూర్తయింది.  ఈ రోజే ఫ‌స్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఇక  త్వర‌లో క‌నులు క‌నుల‌ను క‌ల‌సాయంటే, ట్వంటీ ట్వంటీ అనే చిత్రాల‌ను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడ‌ట‌. మ‌రో విష‌యం ఏంటంటే ఈ మూడు సినిమాల‌కు కూడా మారుతి ద‌ర్శక‌త్వ ప‌ర్వవేక్షణ మాత్రమే చేస్తున్నాడ‌ట‌.. అంతేకాదు  త‌న ప్రెండ్స్ ని ద‌ర్శకులుగా ప‌రిచ‌యం చేస్తున్నాడ‌ని ఫిల్మ్ న‌గ‌ర్ క‌బ‌ర్.  ఈ రోజుల్లో అనే  చిన్న సినిమాతో ద‌ర్శకుడిగా మారిన మారుతి  ఇలా కొత్త ద‌ర్శకుల‌కు ఛాన్స్ ఇవ్వడం చెప్పుకోవాల్సిన విష‌యమే. అయితే ఆ విష‌యం క‌న్నా   విశేషం బూతు స్ధానంలో వెండితెర‌పై ప్రేమను నింపుతాన‌ని  మారుతి ప్రక‌టించ‌డం .

మరింత సమాచారం తెలుసుకోండి: