వ్యాపారాన్ని పెంచుకోవడం కోసం వ్యాపార సంస్థలు రకరకాల ఆఫర్లు ఇస్తూ ఉంటాయి. అదేవిధంగా సినిమాలు కూడా వ్యాపారమే కాబట్టి తమని నమ్ముకుని సినిమాలు తీసి నష్టపోయిన నిర్మాతలను ఆదుకోవడానికి హీరోలు రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. గతంలో సూపర్ కృష్ణ అయితే తనతో సినిమాలు తీసి పరాజయం చెందిన నిర్మాతలకు వారు తరువాత తీసే సినిమాలలో ఫ్రీ గా చేస్తానని చెప్పేవారట.  ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్  దీన్ని పాటించి చూపించాడు. తీన్ మార్ సినిమాతో బాగా నష్టపోయిన బండ్ల గణేష్ కు "గబ్బర్ సింగ్'' ఆఫర్ ఇచ్చాడు పవన్ కల్యాన్. తీన్ మార్ తో నిర్మాత నష్టపోయిన సొమ్ము ను గబ్బర్ సింగ్ తో రికవర్ చేసుకునే అవకాశం ఇచ్చిన పవన్ ను ఆదర్శంగా తీసుకుని ఇప్పుడు అల్లు అర్జున్ కూడా దాన్నే  ఆచరిస్తున్నాడని తెలుస్తోంది.
 "ఇద్దరమ్మాయిలతో'' సినిమాతో గణేష్ బాబు కు నష్టాలే మిగిలాయని అంటున్నారు. దీంతో ఆ నష్టాలను పూడ్చడానికి అల్లు అర్జున్ పూనుకున్నాడట. పూరిని నమ్ముకోవడం వల్ల జరిగిన నష్టాన్ని పూరిస్తానని ఈ హీరో నిర్మాతకు హామీ ఇచ్చాడని తెలుస్తోంది. ఈ సినిమాకు "డాన్ శీను'' 'బలుపు'ల దర్శకుడు గోపిచంద్ మలినేని డైరెక్షన్ చేస్తారని సమాచారం. ప్రస్తుతం రేసుగుర్రం షూటింగ్ బిజీలో ఉన్న అల్లు అర్జున్ తర్వాత లింగుస్వామి సినిమా చేయబోతున్నాడు. అనంతరం గణేష్ బాబు, గోపిచంద్ మలినేని కాంబోలోని సినిమా ను చేస్తాడని తెలస్తోంది. పవన్ కళ్యాణ్ ఔదార్య సూత్రాన్ని అనుకరిస్తూ కోట్లాది రూపాయలను పరితోషికలుగా తీసుకోవడమే కాకుండా నిర్మాతల శ్రేయస్సును  కూడా తను ఆలోచిస్తానని సంకేతాలు పంపేటట్లుగా బన్నీ రికవరీ ఆఫర్ ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

ప్రస్తుతం ఉన్న పోటీ వాతావరణంలో చాలా మంది యంగ్ హీరోలు బన్నీ పాటించిన సాంప్రదాయాన్ని అనుసరించేలా కనిపిస్తోంది. మరి ఈ రికవరీ ఆఫర్ తో టాలీవుడ్ లో బన్నీ ఇమేజ్ ఎంత వరకూ పెరుగుతుందో చూడాలి.... 

మరింత సమాచారం తెలుసుకోండి: