సైకో ప్రమోష‌న్ కోసం హైద‌రాబాద్ వ‌చ్చిన వ‌ర్మ ఓ సెన్సేష‌న‌ల్ కామెంట్ చేశారు. ఆ కామెంట్ వింటే కొ్ద్దిమంది ఆనందంతో స్టెప్స్ వేస్తారు. మ‌రికొద్దిమంది ఆందోళ‌న చెందుతారు. ఇంత‌కీ ఆ కామెంట్ ఏంటంటే వ‌ర్మ ఇక‌పై సినిమాలు చేయ‌ర‌ట‌. ఆ సినిమాలు చేయ‌డం మానేస్తాన‌ని ప్రక‌టించాడు. ఏంటి నిజ‌మా.? అని కంగారు పడ‌కండి. ఎందుకంటే అస‌లు విష‌యం వేరే వుంది. అదేంటంటే ....

వ‌ర్మ కెరీర్ మొద‌టి నుండి అంటే శివ ద‌గ్గర నుండి ఆ మ‌ద్య వ‌చ్చిన 26/11ముంబాయిపై దాడి వ‌ర‌కు మాఫియా, హింస‌, హ‌ర్రర్ సినిమాలే చేశాడు. స‌క్సెస్ అయ్యాడు. అయితే ఫైటింగ్ సినిమాలు చేసి చేసీ వ‌ర్మ బోర్ కొట్టేసింద‌ట‌. ఎంత‌సేపు వెండితెర‌పై ర‌క్తం చిందిస్తుంటే నిద్రలోనూ అలాంటి క‌ల‌లే వ‌స్తున్నాయ‌ట‌. అందుకే ఇక‌పై నేను అలాంటి సినిమాలు చేయ‌న‌ని ప్రక‌టించాడు. అయితే వ‌ర్మ అలాంటి సినిమాలు కాకుండా వేరే ఏ సినిమాలు తీయ‌గ‌ల‌డు.? కొంప‌దీసి సినిమాలు తీయ‌డం ఆపేస్తాడా అని ఓ డౌట్ వ‌స్తుందికదా..? దానికి కూడా వ‌ర్మ క్లారిటీ ఇచ్చారు.

ఆ మ్యాట‌రేంటంటే ఈ మ‌ద్య ఎందుకో వ‌ర్మకు ప్రేమ‌క‌ధ‌ల‌పై మ‌న‌స్సు మ‌ళ్లింద‌ట‌. అందుకే ఇక‌పై క్యూట్ క్యూట్ ల‌వ్ స్టోరిస్ తెర‌కెక్కించ‌బోతున్నట్టు ఎనౌన్స్ చేశాడు. ఈ విష‌యంపై కొద్దిమంది ద‌రిద్రం పోయింది అంటుంటే....వ‌ర్మ ఫ్యాన్స్ మాత్రం తెగ ఫీల‌యిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: