మన టాలీవుడ్ నిర్మాతలు తమ సినిమాలను హిట్ చేసుకోవడానికి ఎదో ఒక మార్గం ఎంచుకుంటూనే ఉంటారు. ఆ వెరైటీ మార్గమే 3డీ టెక్నాలజి. సినిమా చూసే ప్రేక్షకులను వేరే లోకంలోనికి తీసుకువెళ్ళిపోయి ఆశ్చర్యానికి లోనుచేసే ఈ టెక్నాలజిని మన నిర్మాతలు బూతు ప్రయోగానికి వీలుగా మలుచుకుంటున్నారు. దీనికి ఉదాహరణగా వచ్చే శుక్రువారం విడుదల కాబోతున్న అల్లరి నరేష్ యాక్షన్ 3డీ సినిమాలో ఈ బూతు ప్రయోగానికి ఈ టెక్నాలజీని శక్తి మేరకు వాడుకుంటున్నారని టాక్.

 ఈ మధ్య కాలంలో అల్లరోడి సినిమాలలో ధారాళంగా హీరోయిన్ ల అందాల ఆరబోతల సన్నివేశాలు ఉంటున్నాయి. ఈ మార్గంలోనే ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటించిన నీలమ్ ఉపాధ్యాయ, స్నేహ ఉల్లాల్ తమ అందాలను విపరీతంగా ఎక్స్ పోజ్ చేసారట. అసలే 3డీ సినిమా కావడంతో ఈ సెక్సీ భామలు ప్రేక్షకల మీద వాలుతున్నట్లు, వారి అందాలను ప్రేక్షకులకు అతి దగ్గరగా చుపిస్తున్నాట్లు ఫీలింగ్ వచ్చే లా చిత్రీకరణ చేసారట . ఈ ప్రయోగం చూసి దిమ్మతిరిగి పోయిన సెన్సార్ బోర్డు సభ్యులు ఏమిచేయాలో అర్ధంకాక, వీలైనంత కట్స్ వేసి A సర్టిఫికేట్ ఇచ్చారట.

హాస్య సినిమాగా నిర్మించిన ఈ యాక్షన్ 3డీ సినిమాకు A సర్టిఫికేట్ ఏమిటీ అని నిర్మాతలు ప్రశ్నస్తే ఈ సినిమాకు A సర్టిఫికేట్ ఇవ్వడం తప్ప మరే మార్గం లేదనీ 3డీ సినిమా అయినంత మాత్రాన ఇంత నాటుగా అందాలు చూపెట్టాలా అంటూ ఆశ్చర్యపోయారట. మరి సుడిగాడు చేస్తున్న ఈ కొత్త ప్రయోగం యూత్ ను ఎంత వరకూ ఎట్రాక్ట్ చేయకలుగుతుందో చూడాలి.....  

మరింత సమాచారం తెలుసుకోండి: