సోనాక్షిపై ఆక‌తాయిలు చేతులేశార‌ట‌. ప్రమోష‌న్ కోస‌మని వ‌చ్చిన ఈ సుంద‌రాంగినిని ఈవెంట్ మద్యలోనే వెళ్లిపోయేలా చేశార‌ట‌. నిజానికి
ప‌బ్లిక్ ఫంక్షన్లకు హీరోయిన్స్ అటెండ్ అవ్వాలంటే భ‌య‌ప‌డుతుంటారు. ఏ క్షణం ఎటు వైపు నుండి వ‌చ్చి ఆక‌తాయిలు తాకుతారోన‌ని టెన్షన్ ప‌డుతూనే పైకి న‌వ్వుతుంటారు. అయినా కూడా ఒక్కోసారి ఆక‌తాయిలు అభిమానం అంటూ మీద ప‌డ‌తారు. చెంప దెబ్బలు తింటుంటారు. ఇపుడు అదే సమ‌స్యను ఫేస్ చేసింది బాలీవుడ్ టాప్ హీరోయిన్ సోనాక్షి సిన్హ.

ర‌ణ‌వీర్ క‌పూర్ తో ఈ సుంద‌రి న‌టించిన లుటెరా వ‌చ్చే నెల 5న విడుద‌ల కానుంది. దీంతో సోనాక్షి, ర‌ణ‌వీర్ ప్రమోష‌న్ ని మొద‌లెట్టారు. ఈ సంద‌ర్బంగా ఓ ప్రైవేట్ ఫంక్షన్ కి ఇద్దరూ అటెండ్ అయ్యారు. కాస్త బొద్దుగా, ముద్దుగా వుండే సోనాక్షి బ్లాక్ లేస్ డ్రస్ లో వ‌చ్చింది. ఆ డ్రస్ లో ఆమెను చూసిన ఫ్యాన్స్ టెంమ్ట్ అయ్యారు . ఆటోగ్రాఫ్స్, ఫోటోస్ అంటూ చేతులు క‌ల‌పడానికి ట్రై చేశారు. మీద ప‌డ్డారు. కొద్దిమంది సందు దొరికింద‌ని న‌డుము గిల్లార‌ట‌. అంతే సోనాక్షికి మండి ఒక్కటిచ్చింద‌ట‌. అంతేకాదు ఆ కోపంలోనే ఈవెంట్ నుండి బ‌య‌ట‌కు వెళ్లిపోయింద‌ని బి టైన్ క‌బ‌ర్.

మరింత సమాచారం తెలుసుకోండి: