టాలీవుడ్ ఇండస్ట్రీ దశ మార్చిన హీరో చిరంజీవి ఆయన నటించిన చిత్రాలలో ఎన్నో పాటలు హిట్ అయ్యాయి. ఇప్పటికీ చిరూ చిత్రాల్లోని పాపులర్ పాటలు ఏదో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. ఇందులో వింతేముంది? అనుకుంటున్నారా. ఆయన పాటలు ఇక్కడ వినిపిస్తే వింతేమీ లేదుకానీ మన పక్కదేశం అయిన చైనాలో వినిపిస్తే వింతే మరి. చిరంజీవి నటించిన 'దొంగ' సినిమాలో ‘గోలీమార్' సాంగుకు ఇక్కడ ఎంత ప్రాచుర్యమో తెలుసు.

అప్పట్లో ఆ సాంగ్ సూపర్ హిట్, అంధ్రా మైకేల్ జాక్సన్ లా చిరూ స్టెప్స్ వేస్తుంటే ఆ రోజులలో ధీయేటర్లు అధిరీపోయాయి. ఈ  మధ్య చైనాలోని ఓ ప్రముఖ చానెల్ నిర్వహిస్తున్న ఓ రియాలిటీ షోలో ఈ పాటను ఓ యువకుడు రీమిక్స్ చేసేశాడు. ఆ సాంగు ట్యూన్స్ చైనీయులకు బాగా నచ్చాయి. తెలుగు రాక పోయినా ఆ పాటకు చైనీయులు తెగ వినేస్తున్నారు. పశ్చిమ ఐరోపా ఖండం, ల్యాటిన్ అమెరికా లలో సైతం ‘దొంగ' చిత్రంలో గోలి మార్ పాట బాగా పాపులర్ అయింది. ఈ పాటకు..... మైఖేల్ జాక్సన్ రూపొందంచిన థ్రిల్లర్ ఆల్బం మూలం.

ఈ పాటల్లో చిరు మరియు జాక్సన్ నాట్య భంగిమలు, వేషధారణలలో చాలా పోలికకనబడుతుంది. అప్పట్లో ఈ  ‘దొంగ’ సినిమాకు కోదండరామి రెడ్డి దర్శకత్వం వహించారు.  1985 లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్. సినిమారంగం వదిలి, నటన మాని చాలా సంవత్సరాలు అయినా చిరూ అంటే మనకే కాదు ఇతర దేశాలువారికి కూడా ఎంత క్రేజో దీనిని బట్టీ అర్ధం అవుతుంది. కాబట్టే ఆయన ఇప్పటికీ ఎప్పటికీ మెగాస్టార్....   
  


 

మరింత సమాచారం తెలుసుకోండి: