మంచి సినిమాల‌కు రోజులు కావివి. మ‌సాలా ద‌ట్టిస్తేనే చూస్తారు. మిథునం సినిమాకి థియేట‌ర్లు దొరికాయా?  మారుతి సినిమాకైతే థియేటర్లు కావ‌ల్సిన‌న్ని ఉంటాయి. అందుకే మాది మంచి సినిమా అని చెప్ప‌కుండా మ‌సాలా సినిమా అని ప్ర‌మోష‌న్ చేసుకొంటున్నారు కొంద‌రు. అఫ్ కోర్స్ అలా చెబితే -

కావ‌ల్సినంత ప‌బ్లిసిటీ ఫ్రీగా దొరుకుతుంది క‌దా?విష‌యం ఏమిటంటే శ్రీ‌కాంత్ క‌థానాయ‌కుడిగా బుధ‌వారం నాటుకోడి అనే సినిమా మొద‌లైంది. శ్రీ‌కాంత్‌తో దేవ‌రాయ సినిమా తీసిన నాని కృష్ణ ఈ సినిమాకి ద‌ర్శ‌కుడు. ఈ సినిమా గురించి ఒక్క ముక్క‌లో చెప్పాలంటే మంచి త‌క్కువ - మ‌సాలా ఎక్కువ‌గా ఉంటుంది - అనేశాడు ద‌ర్శ‌కుడు.

ఈ సినిమాలో వేడి వేడి సీన్లు ఉంటాయి అని చెప్ప‌డానికి ఇంత‌కంటే నిద‌ర్శ‌నం ఏం కావాలి?ఓ నిజాయ‌తీగల పోలీస్ ఆఫీస‌ర్‌కీ, లంచ‌గొండి త‌న‌యుడికీ మ‌ధ్య జ‌రిగే క‌థ ఇది. ఇందులో శ్రీ‌కాంత్ తండ్రిగా కోట శ్రీ‌నివాస‌ర‌రావు న‌టిస్తున్నారు. శ్రీ‌కాంత్ కూడా పోలీసే!  క‌థానాయిక ఇంకా ఫైన‌లైజ్ కాలేదు. ఫ్యామిలీ హీరో శ్రీ‌కాంత్ ఈ మ‌సాలా సినిమాకి ఎంత వ‌ర‌కూ న్యాయం చేస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: