‘పెళ్ళి కొడుకుల వేట జోరుగానే జరుగుతోంది’ అంటోoది  తాప్సీ, ఈ మాటలు చదివి త్వరలో తాప్సీ పెళ్ళి చేసుకుంటోoది  అని అనుకుంటున్నారా అదేమీ లేదు. తాప్సీ చెపుతోంది తన పెళ్ళి గురించి కాదు. తన స్నేహితుల పెళ్ళి గురించి. ప్రస్తుతం తాప్సీ సినిమాలు చేస్తూనే ఖాళీ సమయంలో తన స్నేహితుల పెళ్ళి సంబందాల వేటలో ఉందట.

తన స్నేహితుల పెళ్ళిళ్ళు తానే దగ్గర ఉండి చేయిస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉందని ఈ చొట్టబుగ్గల సుందరి చెబుతోంది. ప్రస్తుతం ‘సాహసం’ సినిమాలో నటిస్తున్నావు కదా, మీరు ధైర్య వంతురాలువేనా? అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ అమ్మో నీళ్ళు అనుకుంటే నీళ్ళల్లో స్కూబా డైవింగ్ చేయలేము కదా అంటూ తనకు స్కై డైవింగ్ కూడా నేర్చుకోవాలని ఉందని అది కూడా నేర్చుకుంటానని  50 సంవత్సరాలు ఇలాంటివి ఏమీ చేయలేము కదా అంటూ మాటలు చెప్పింది. అంతేకాదు జీవితంలో ఏమి జరగాలని రాసి ఉంటే అదే జరుగుతుందని వేదాంతం చెపుతోంది తాప్సీ .

 ప్రస్తుతం మూడు సినిమాలలో నటిస్తున్న తాప్సీ త్వరలో మరో హిందీ సినిమాలో కూడా నటిస్తోంది. ఆమెకు కొద్దిగా అదృష్టం తిరిగితే ఆమె టాలీవుడ్ టాప్ స్టార్ అవడం పెద్ద కష్టమేమి కాదు..

మరింత సమాచారం తెలుసుకోండి: