మ‌న హీరోలు మార్కెట్ స్టాయి పెంచుకోవ‌డానికి అష్ట‌క‌ష్టాలూ ప‌డుతున్నారు. తెలుగులో తీసిన సినిమాని త‌మిళంలో విడుద‌ల చేసి త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకొంటున్నారు. అవ‌కాశం ఉంటే బాలీవుడ్‌లోనూ సినిమా తీస్తున్నారు. ఇప్పుడు రామ్‌చ‌ర‌ణ్ అదే చేస్తున్నాడు. ఇప్ప‌టి వర‌కూ కేవ‌లం తెలుగు చిత్ర‌సీమ‌కే ప‌రిమితం అయిన త‌న స్టామినాని ద‌శ దిశ‌లా విస్త‌రించ‌డానికి కృషి చేస్తున్నాడు.

జంజీర్ సినిమాతో బాలీవుడ్ వెళ్తున్నాడు చ‌ర‌ణ్‌. ఇప్పుడు ఆ సినిమాని వీలైన‌న్ని భాషల్లో విడుద‌ల చేసి త‌న పాపులారిటీ పెంచుకోవాల‌ని చూస్తున్నాడు.జంజీర్ తెలుగులో తుఫాన్‌గా విడుద‌ల అవుతోంది. ఈ సినిమాని త‌మిళంలోనూ విడుద‌ల చేస్తార‌ట‌. అంతే కాదు...మల‌యాళంలో ముంబై హీరో అనే పేరుతో అనువ‌దిస్తార‌ట‌. మ‌ల‌యాళంలో బ‌న్నీకి మంచి మార్కెట్ ఉంది.

బ‌న్నీ సినిమాలు ఇటు తెలుగులో, అటు మ‌ల‌యాళంలో మంచి వ‌సూళ్లు సాధిస్తాయి. అందుకే ఆయ‌న్ని మ‌ల్లూ స్టార్ అంటారు. ఇప్పుడు అక్క‌డ బన్నీ- చ‌ర‌ణ్‌ల మ‌ధ్య పోటీమొద‌ల‌వుతుంద‌న్న‌మాట‌మొత్త‌మ్మీద ఒక్క సినిమాతో నాలుగు ప‌రిశ్ర‌మ‌ల‌ను ద‌డ‌ద‌డ‌లాడిద్దాం అనుకొంటున్నాడు చ‌ర‌ణ్. చివ‌రికి ఏం అవుతుందో చూడాలి. అక్టోబ‌ర్‌లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: