ఏ ముహూర్తంలో బాల‌కృష్ణ సినిమా రూల‌ర్‌కి అంకురార్ప‌ణ జ‌రిగిందో గానీ - ఈ సినిమాకి ముందు నుంచీ క‌ష్టాలే! ముందు స‌రైన నిర్మాత దొర‌క‌లేదు. ఆ త‌ర‌వాత క‌థానాయిక‌ల ద‌గ్గ‌ర స‌మ‌స్య వ‌చ్చింది. బాల‌కృష్ణ రాజ‌కీయాల‌తో ఫుల్ బిజీగా ఉండ‌డం వ‌ల్ల - ఈ సినిమా త్వ‌ర‌గా సెట్స్‌పైకి వెళ్ల‌లేక‌పోయింది. ఇప్పుడ‌న్నీ కుదిరినా - ముందుకు క‌ద‌ల‌డం లేదు.

రూల‌ర్ షెడ్యూల్ ఈ నెల 15 నుంచి దుబాయ్‌లో మొద‌లుపెట్టాల‌ని చిత్ర‌బృందం భావించింది. అందుకు స‌న్నాహాలు కూడా జ‌రిగాయి. అయితే బాల‌య్య‌కు అమెరికాలో అర్జెంటు పని ప‌డింది. బ‌స‌వ‌తార‌కం ఆసుప‌త్రి కి సంబంధించిన ప‌నుల కోసం అమెరికా వెళ్లాల్సి వ‌చ్చింది.

దాంతో రూల‌ర్ షూటింగ్ వాయిదా ప‌డింది.జులై మొద‌టి వారంలో షూటింగ్ మొద‌లుపెట్టి జెట్ వేగంతో ఈ సినిమాని పూర్తి చేయాల‌ని ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను డిసైడ్ అయ్యాడు. అయితే ఈ బండికి ఇలాగే బ్రేకులు ప‌డితే వ‌చ్చే సంక్రాంతికి ఈ సినిమా రావ‌డం అనుమాన‌మే.

మరింత సమాచారం తెలుసుకోండి: