ముద్దు పేర్లు సినిమా టైటిళ్లుగా రావ‌డం కొత్తేం కాదు. అల్లు అర్జున్‌ని బ‌న్నీ అని పిలుచుకొంటారు. ఆ పేరుతో ఓ సినిమా వచ్చింది. ప్ర‌భాస్ అంద‌రినీ డార్లింగ్ అంటాడు. అదీ సినిమా టైటిల్ అయిపోయింది. ఇప్పుడు రామ్‌చ‌ర‌ణ్ మిగిలాడు. రామ్‌చ‌ర‌ణ్‌ని ముద్దుగా చెర్రీ అనిపిలుచుకొంటారు. నాయ‌క్‌లో ఇద్ద‌రు చ‌ర‌ణ్‌లు ఉంటారు. ఒక పాత్ర‌కు చెర్రీ అనే పేరు పెట్టారు.

ఇప్పుడు ఏకంగా చ‌ర‌ణ్ సినిమాకి అదే టైటిల్ అయిపోయింది.మిర్చి ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్నాడు. ఈ సినిమాకి చెర్రీ అనే పేరు ప‌రిశీలిస్తున్నార‌ట‌. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ సినిమా ఇది. దానికి చెర్రీ అనే టైటిల్ అయితేనే బాగుంటుంద‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. నాయ‌క్ సినిమాకు ముందు అనుకొన్న పేరు కూడా చెర్రీనే.

అయితే చివ‌రికి నాయ‌క్‌గా వ‌చ్చింది. మరి కొర‌టాల శివ సినిమాకు చెర్రీనే ఉంచుతారా? లేదంటే మ‌రోటి వెదుక్కొంటారా?  అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాలి. ఇటీవ‌లే ఈ సినిమా లాంఛ‌నంగా ప్రారంభం అయ్యింది. ఎవ‌డు సినిమా పూర్త‌య్యేకే చెర్రీ రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుపెడ‌తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: