త్రివిక్ర‌మ్ కి మెగా హీరోల మానియా ప‌ట్టుకొంది. అల్లు అర్జున్‌తో జులాయి తీశాడు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో రెండో సారి జ‌త క‌ట్టాడు. ఆ త‌ర‌వాత కోబ‌లి సినిమా.. ప‌వన్‌తో తీస్తాడ‌ట‌. అంతేకాదు ఇప్పుడు రామ్‌చ‌ర‌ణ్ కోసం కూడా ఓ క‌థ సిద్దం చేస్తున్నాడట‌. అదే గ‌నుక నిజ‌మైతే వ‌రుస‌గా మూడు సినిమాల్ని మెగా హీరోల‌తోనే తీసిన దర్శ‌కుడు

అవుతాడు త్రివిక్ర‌మ్‌.చ‌ర‌ణ్‌-త్రివిక్ర‌మ్ క‌ల‌యిక‌లో ఓ సినిమా వచ్చే అవ‌కాశం ఉంద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ టాక్‌. మ‌గ‌ధీర త‌ర‌వాత చ‌ర‌ణ్‌-త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ సెట్స్‌పైకి వెళ్లాల్సింది. కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల ఆ అవ‌కాశం భాస్క‌ర్ అందుకొన్నాడు. ఇంత‌కాలానికి ఈ కాంబినేష‌న్ కుదిరే ఛాన్స్ ద‌క్కిందిత్రివిక్ర‌మ్ ప్ర‌స్తుతం అత్తారింటికి దారేది ప‌నిలో ఉన్నాడు.

చ‌ర‌ణ్ చేతిలో రెండు మూడు సినిమాలున్నాయి. ఇవి పూర్త‌వ‌డానికి కొంచెం స‌మ‌యం ప‌డుతోంది. అంటే త్రివిక్ర‌మ్ సినిమా ఈయేడాది మొద‌ల‌వ్వ‌డం క‌ష్ట‌మే. 2014లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: