స‌ర‌దాగా తీసుకొంటున్నాం గానీ.. బ‌ర్నింగ్ స్టార్‌కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. త‌న ఫ‌స్ట్ లుక్‌తో గుండె గాభ‌రా చేసినా సంపూ బాబూకి కొంత‌మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఫేస్ బుక్ ఫాలోవ‌ర్స్ చాలామంది ఉన్నారు. వాళ్లంతా క‌లసి క‌ట్టుకొచ్చి హృద‌య కాలేయం సినిమా చూసినా.. అది క‌మ‌ర్షియ‌ల్‌గా పెద్ద హిట్టే.ఇటీవ‌లే హృద‌య కాలేయం టీజ‌ర్‌ని యూ ట్యూబ్‌లో విడుద‌ల చేశారు.

తొలి రెండు రోజుల్లోనే ఏకంగా మూడు ల‌క్ష‌ల హిట్స్ వ‌చ్చాయి. ఇదేం ఆషామాషీ విష‌యం కాదు. ఫేస్‌బుక్ ద్వారా కొంత‌మందిని బుట్ట‌లో వేసుకొన్నాడు సంపూ బాబు. ఈ బాబులో ఎంత బిల్డ‌ప్ ఉందో చూద్దామ‌ని టీజ‌ర్‌లోకి వెళ్తున్నారు. అందులో సంపూ డైలాగులు చూసి స్ట‌న్ అయిపోతున్నారు.

స‌ర‌దాగా న‌వ్వుకొందామ‌ని మ‌ళ్లీ మ‌ళ్లీ చూస్తున్నారు. దాంతో.. క్లిక్‌లు పెరిగాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ టీజర్ ని ఏకంగా మూడున్న‌ర ల‌క్ష‌ల మంది చూశారు. ఇంకా చూస్తూనే ఉన్నారు.ఈ సినిమా ఫారెన్ రేట్స్ కోసం అప్పుడే ఫ్యాన్నీ ఆఫ‌ర్లు వ‌స్తున్నాయ‌ట‌. చూస్తుంటే స‌ర‌దా టీజ‌రే, సంచ‌ల‌నాల‌కు నాంది అనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: