జ‌న‌ర‌ల్ గా ఫిల్మ్ ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువ‌. కాజ‌ల్ కి వైట్ డ్రస్ సెంటిమెంట్, ప్రిన్స్ కి ముంబాయ్ హోట‌ల్ సెంటిమెంట్, త్రిష‌కు తాగుడు సెంటిమెంట్ ఇలా స్టార్స్ అంద‌రికీ ఒక్కో టి వుంది. ఇపుడు ఆ లిస్ట్ లోకి క్యూట్ గ‌ర్ల్ స‌మంత కూడా చేరిపోయింది. ఆ సెంటిమెంట్ ప్రకార‌మే అత్తారింటికీ దారేదీ క‌న్ఫ్ మ్ గా నే హిట్టని చెబుతోంది

అస‌లు మ్యాట‌రేంటంటే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌మంత కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న అత్తారింటికీ దారేదీ సినిమా షూటింగ్ ప్రస్తుతం స్విట్లర్లాండ్ లో జ‌రుగుతోంది. అందులో విశేషం ఏముంది..? ప‌వ‌న్ సినిమా అంటే పాటల్ని విదేశాల్లో తీయారా ఏందీ అని అంటారా? ఆగండి ఆగండి అక్కడికే వ‌స్తున్నా. ఇక్కడ పాట చేయ‌బోతున్న సంగ‌తిగానీ, ఆమె కోసం అక్కడు ఓ హోట‌ల్ లో తీసుకున్న రూం నెంబ‌ర్ గానీ స‌మంతకు మొద‌ట తెలియ‌ద‌ట‌. మేడమ్ టిక్కెట్స్ బుక్ చేశాం. రేపు స్విట్లర్లాండ్ కి వ‌చ్చేయండి అని నిర్మాత స‌మంత‌కు చెప్పాడ‌ట‌.

వెళ్లాక‌ చూస్తే అది దూకుడు సాంగ్ కోసం వ‌చ్చిన‌ప్పటి సేమ్ రూం అట‌. ఇటు రాయే సాంగ్ షూట్ కోసం స్వీస్ వెళ్లిన‌ప్పుడు స‌మంత అదే రూంలో వుండేద‌ట‌. సో ఆ సెంటిమెంట్ ప్రకారం దూకుడులాగే అత్తారింటీకీ దారేదీ బ్లాక్ బ్లస్టర్ అవ్వడం ఖాయ‌మ‌ని స‌మంత డంకా భ‌జాయిస్తోంది. మ‌రి స‌మంత సెంటిమెంట్ వ‌ర్క్ ఔట్ అవుతుందో లేదో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: