హీరో గోపీచందుని మరో హీరో శ్రీకాంత్ ఫుల్లుగా వాడేసుకుంటున్నాడు. ఇటివలే తన మేన కోడల్ని హీరో గోపీచందుకిచ్చి పెళ్లి చేసిన శ్రీకాంత్,గోపీచందుతో తన తాజా మూవీకి క్లాప్ కొట్టించు కోవడంతో గోపీచందుని శ్రీకాంత్ ఈ రకంగా వాడుకుంటున్నాడని అందరూ అనుకుంటున్నారు. 
 

పెళ్లి తరువాత ఫ్రెష్ లుక్కులో గోపీ ఈ ఈవెంటుకి అటెండ్ అవ్వడంతో నిజంగానే మూవీ ఓపెనింగ్ కి మంచి కళ వచ్చింది. ఇంతకీ వీరిద్దరూ కలిసి కనిపించిన మూవీ పేరు చెప్పలేదు కదా! నాటు కోడి. ఈ టైటిల్ శ్రీకాంతుకేమో గానీ గోపీచందుకి అయితే కత్తిలా ఉండేదని, ఈ మూవీ ఓపెనింగుకి వచ్చిన పెద్దలు కొందరు అనుకోవడం విశేషం. 
 

ఇటివలే మ్యారేజ్ చేసుకున్న ఈ కొత్త పెళ్లి కొడుకు కెరియర్ కూడా శ్రీకాంతులానే  ఏమంత బాగాలేదు. త్వరలో అతను చేస్తున్న సాహసం సక్సెస్ అయితేనే గోపీచంద్ కొట్టిన ఈ క్లాపుకి కూడా ఓ అర్థం ఉంటది. లేదంటే మనోడి తరువాతి చిత్రానికి శ్రీకాంత్ క్లాప్ కొట్టాల్సి ఉంటది.

మరింత సమాచారం తెలుసుకోండి: