పవన్ కళ్యాణ్, సంపత్  నంది డైరెక్షన్లో అతిత్వరలో చేయబోతున్న మూవీని అందరూ గబ్బర్ సింగ్ 2 అని అనుకుంటున్నారు. కానీ అది గబ్బర్ సింగ్ 2 కాదని, తన బర్త్ డే సందర్బంగా దర్శకుడు సంపత్ నంది లేటెస్టుగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. 
 

ఇంకా ఈ సినిమాకి టైటిల్ అనుకోలేదని, తన దృష్టిలో మాత్రం 'బెంగాల్ టైగర్' అనే టైటిల్ అనుకుంటున్నట్లుగా తెలిపాడు. కానీ ఇదే కనఫరమ్ అవుతుందని చెప్పలేను అని కూడా తెలిపారు.  ప్రెజెంట్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ చేస్తున్న మూవీ అనంతరం ఈ మూవీ కి సంబందించిన అన్ని విషయాలు తెలుపుతామని, అలాగే హీరోయిన్ ఎంపిక కూడా ఇంకా పూర్తి కాలేదని తెలిపారు. 
 

సో.. దర్శకుడు సంపత్ నంది చెబుతున్న ప్రకారం ఈ మూవీ గబ్బర్ సింగ్ 2 అయితే మాత్రం కాదు. పైగా కథ కూడా ఆ సినిమాకి సీక్వెల్ కాదని ఫుల్ క్లారిటీతో చెబుతున్నాడు కాబట్టి గబ్బర్ సింగ్ 2 డైరెక్టర్ సంపత్ నంది అయితే కాదు. గబ్బర్ సింగ్ 2 ఇప్పుడప్పుడే  రాదు అని తెలుస్తుంది కదా!

మరింత సమాచారం తెలుసుకోండి: