ప్రజెంట్ పవన్ కళ్యాణ్ తో మూవీ చేస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి రోజుకో న్యూస్ వస్తుంది. జస్ట్ కొద్ది రోజుల క్రితమే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ తరువాత మూవీ ఉండబోతుంది అని అనుకున్నారు. మళ్ళీ తాజాగా రామ్ చరణ్ తో మూవీ ఓకే అయిందనే న్యూస్ సంచరిస్తుంది. 
 

అసలిప్పుడు రామ్ చరణ్ కానీ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కానీ ఎంత బిజీగా ఉన్నారో అందరికి తెలిసిన విషయమే. కానీ ఎవరు పుట్టిస్తున్నారో గానీ త్రివిక్రమ్ పై బాగా దృష్టి పెడుతున్నారు. త్రివిక్రమ్ ప్రజెంట్ పవన్ కళ్యాణ్ సినిమాపై పెడుతున్న కాన్ఫిడెన్స్ ని దెబ్బ కొట్టాలని ప్రయత్నిస్తున్నారో లేక కావాలనే కొంటె రాతలు రాస్తున్నారో తెలియదు బట్ త్రివిక్రమ్ ని మాత్రం బాగా టార్గెట్ చేస్తున్నారు. 
 

వాస్తవానికి త్రివిక్రమ్ ఇప్పుడు చేస్తున్న మూవీ తరువాత చేసే మూవీ గురించి ఎటువంటి డెసిషన్ తీసుకోలేదని తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే త్రివిక్రమ్ ఏదైనా పని చేస్తున్నాడంటే ఆ పని పూర్తి అయింది అని క్లారిటీ కొస్తే తప్ప మరో వర్క్ స్టార్ట్ చేయడు. అలాంటిది ఎన్టీఆర్, చరణ్, అల్లు అర్జున్ అంటూ రోజుకో హీరోతో త్రివిక్రమ్ సినిమా చేస్తున్నాడంటూ కొందరు పుట్టించేస్తే ఎవరు నమ్ముతారు? ముందు ముందు చేస్తాడేమో కానీ ప్రజెంట్ ఏ హీరో మూవీ గురించి త్రివిక్రమ్ ఆలోచించడం లేదని త్రివిక్రమ్ యూనిట్ తెలుపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: