చిన్న సినిమాల ద‌ర్శ‌కుడు శ్రీ‌నివాస రెడ్డి... ఢ‌మ‌రుకంలో స్టార్ డైరెక్ట‌ర్ అయ్యాడు. అంటే స్టార్ హీరోల‌తో సినిమాలు తీసే స్థాయికి ఎదిగాడ‌ని అర్థం. ఆ సినిమా గొప్ప‌గా తీయ‌క‌పోయినా - పాడు చేయ‌లేదు. దాంతో అత‌ను పెద్ద హీరోల‌తోనూ సినిమాలు తీయ‌గ‌ల‌డు అని ప్రూవ్ అయ్యింది, ఇప్పుడు నాగ‌చైత‌న్య‌తో హ‌లోబ్ర‌ద‌ర్ సినిమా తీస్తున్నాడు.

ఈ సినిమా సెట్స్‌పై ఉండ‌గానే శ్రీ‌నివాస‌రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్ త‌గిలింది. త్వ‌ర‌లోనే వెంక‌టేష్‌తో శ్రీ‌నివాస‌రెడ్డి ఓ సినిమా చేస్తాడ‌ని టాలీవుట్ టాక్‌.సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ వెంక‌టేష్ క‌థానాయ‌కుడిగా ఓ సినిమాని నిర్మించాల‌నుకొంటోంది. వారి ద‌గ్గ‌ర కొన్ని హిట్ సినిమాల రైట్స్ ఉన్నాయి. వాటిలో ఒక‌టి..

శ్రీ‌నివాస‌రెడ్డికి అప్ప‌గించారట‌. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్ర్కిప్టు వ‌ర్క్ జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించి కొత్త సంగ‌తులు తెలుస్తాయి.వెంక‌టేష్ ప్ర‌స్తుతం బోల్ బ‌చ్చ‌న్ రీమేక్‌లో న‌టిస్తున్నాడు. ఈ సినిమాకి గోల్ మాల్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అద‌య్యాకే.. శ్రీ‌నివాస‌రెడ్డితో సినిమా ఉండే అవ‌కాశాలున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: