క‌మ‌ల్ కూతురు శ్రుతిహాసన్ స‌క‌ల క‌ళావ‌ల్ల‌భురాలు అనే సంగ‌తి అందరికీ తెలిసిందే. మంచిన‌టి, సంగీత ద‌ర్శకురాలు, గాయ‌ని, చిత్ర‌లేఖ‌నం వ‌చ్చు... ఇలా అన్ని రంగాల్లోనూ త‌న ప్ర‌తిభ చూపిస్తోంది. న‌ట‌న‌- సంగీతం నాకు రెండు క‌ళ్లు అని చెప్తోంది.

మ‌ధ్య మ‌ధ్య త‌న సినిమాల్లో త‌న పాటల్ని తానే పాడుకొంటోంది శ్రుతి.శ్రుతి క‌థానాయిక‌గా బాలీవుడ్‌లో ఓ చిత్రం తెర‌కెక్కుతోంది. అదే డి -డే. శంక‌ర్  హేసాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా కోసం శ్రుతి ఓ పాట కూడా పాడింది. అందులో విశేషం ఏమీ లేక‌పోయినా కేవ‌లం 30 నిమిషాల్లో పాట నేర్చుకొని.

. పాడేసింద‌ట‌. అర‌గంట‌లో రికార్డింగ్ కూడా పూర్త‌య్యేస‌రికి ఆ సంగీత ద‌ర్శ‌కులు షాక్ అయ్యారు. ఇందులో నా గొప్ప‌దనంఏమీ లేదు. అంతా సంగీత ద‌ర్శ‌కులే చూసుకొన్నారు. పాట బాగుంది. నేర్చుకోవ‌డానికి ఎక్కువ స‌మ‌యం ప‌ట్ట‌లేదు అని చెప్తోంది శ్రుతి. మొత్తానికి తండ్రికి త‌గిన కూతురే.

మరింత సమాచారం తెలుసుకోండి: