టాలీవుడ్‌లో ఎంత మంది డాన్స‌ర్లు వ‌చ్చినా వాళ్లందరి స్థానం చిరంజీవిదే. ఇది మేం చేప్పే మాట కాదు. కొరియో గ్రాఫ‌ర్లంతా ముక్త కంఠంతో చెప్పేమాట‌. చిరు లోని డాన్సింగ్ టాలెంట్ తెలిసిన వాళ్లంతా ఇదే మాట చెబుతారు. ఇప్పుడు ప్రభుదేవా కూడా చిరునే నెంబర్ వ‌న్ అంటున్నాడు.

నాకు న‌చ్చిన డాన్స‌ర్ చిరంజీవి మాత్ర‌మే... అని ఈమ‌ద్య ఓ స్టేట్‌మెంట్ ఇచ్చాడు ప్ర‌భుదేవా.చిరులోని డాన్సింగ్ టాలెంట్ గురించి ప్ర‌భుదేవాకు బాగా తెలుసు. ఎందుకంటే ఘ‌రానా మొగుడు లోని బంగారు కోడి పెట్ట‌... పాట నుంచీ చిరుని గ‌మనిస్తూనే ఉన్నాడు ప్ర‌భుదేవా.

చిరంజీవి చివరి చిత్రం శంక‌ర్ దాదా జిందాబాద్‌కీ ఆయ‌నే ద‌ర్శ‌కుడు. అందుకే ప్ర‌భుదేవాపై చిరు ఎఫెక్ట్ బాగా ప‌డిందిబ‌న్నీ, ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ వీళ్లంతా మంచి డాన్స‌ర్లే. కానీ చిరంజీవిలో ఉన్న గ్రేస్ వేరు. చాలా సింపుల్ స్టెప్‌కి కూడా గుర్తింపు తీసుకొస్తారు... అని చిరుని తెగ పొగిడేశాడు ప్ర‌భుదేవా.

మరింత సమాచారం తెలుసుకోండి: