మంచు మనోజ్ కు మంచి టేలెంట్ ఉన్న నటుడిగా పేరుంది కానీ హీరోగా ఇప్పటి వరకూ ఒక పెద్ద హిట్ కూడా లేదు. టేలెంట్ ఉంది రకరకాల పాత్రలు పోషించే ఉత్సాహంతో  పాటు తన తండ్రి  సపోర్టు కూడా ఉండటం తో పరాజయాలు వస్తున్నా అవకాశాలు మాత్రం లోటు లేకుండా వస్తూనే ఉన్నాయి. కానీ ఈ అవకాశాలను ఉపయోగించు కోవడంలో మనోజ్  ఫెయిల్ అవుతున్నాడనే అనుకోవాలి.

 దీనికి ప్రధాన కారణం అతనికి ఉన్న అత్యుత్సాహమే అంటున్నారు. ఈ మంచువారి అబ్బాయి తను నటించే ప్రతీ సినిమా కధ విషయంలోనూ, ఫైట్స్ చిత్రీకరణ విషయంలోనూ దర్శకుడితో సమానంగా వేలు పెట్టి కేలికేస్తాడన్న పేరు ఉంది. ఈ అత్యుత్సాహం వల్ల మనోజ్ తో సినిమా తీస్తున్న దర్శకులు తలలు పట్టుకునే పరిస్థితి వస్తోందట. లేటెస్ట్ గా మనోజ్ హీరో గా నటిస్తున్న పోటుగాడు సినిమా దర్శకుడు పవన్ ను కూడా ముప్ప తిప్పలు పెడుతున్నాడట. డైలాగ్స్ దెగ్గర నుంచి ఫైట్స్ దాకా తన స్టైల్ లో కంపోజ్ చేయమని దర్శకుడి పై ఓ త్తిడి పెంచు తున్నాడట .

 అంతేకాదు అన్ని విషయాలలోనూ తల దూరుస్తూ తానే డైరెక్టర్ గా ఈ మంచు వారి అబ్బాయి చేస్తున్న ఓవర్ యక్ష్యన్ కు పోతుగాడి సినిమా డైరెక్టర్ పవన్ తల పట్టుకుంటున్నాడని టాక్. ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా నిర్మాణ విషయంలో బన్నీ చూపెట్టిన అత్యుత్సాహం ఆ సినిమాకు ఎలా శాపంగా మారిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ పరిస్థుతులలో తన నటన పై దృష్టి పెట్టుకోకుండా మంచు మనోజ్ కు ఈ ఓవర్ యాక్షన్ ఎందుకు అనే మాటలు ఫిలిం నగర్ లో వినిపిస్తున్నాయి...      

 

మరింత సమాచారం తెలుసుకోండి: