పూనమ్ పాండే ఈ పేరు వింటేనే ఎదో ఒక సంచలనం ఈమె మాటలలో చేతలలో ఉంటుంది. సోషల్ మీడియా సైట్లలలో ఈ బాలీవుడ్ నటి రకరకాల హాట్ ఫొటోస్ హాట్ వీడియోస్ నిరంతరం ఉంచుతూ సంచలన వార్తలకు కేరాఫ్ అడ్రెస్స్ గా ఈమె ఎప్పుడూ ఉంటుంది.

అటువంటి పూనమ్ మళ్ళీ వార్తలకు ఎక్కింది ఈ మధ్య మద్రాస్ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. దీనిప్రకారం స్త్రీ పురుషుల మధ్య వివాహం జరగకపోయినా వారి మధ్య పెళ్ళి కాకుండానే శృంగార జీవితం గడిపారని, నిరూపించ గలిగితే వారిని భార్య భర్తలు గానే పరిగణించాలని ఒక సంచలనాత్మక తీర్పు, మద్రాస్ హైకోర్టు ఇచ్చింది. ఈ తీర్పుకు స్పందిస్తూ పూనమ్ పాండే తన ట్విటర్ లో  ‘అయితే తనకు పెళ్ళి అయిపోయినట్లే లెక్క’ అంటూ చాలా ధైర్యంగా ట్విట్ పోస్ట్ చేసింది. ఈ ట్విటర్ ఇప్పుడు బాలీవుడ్ హాట్ టాపిక్ గా మారింది.

పెళ్ళి కాకుండా జరిగిన  తమ శృంగార జీవితం గురించి మాటలు మాట్లాడటానికే మొహమాట పడే సేలిబ్రేటీలు ఉన్న నేటి సినిమా రంగంలో తనకు పెళ్ళి జరుగ కుండానే శృంగార జీవితం గడిపానని ఇన్ డైరెక్ట్ గా తన ట్విటర్ ద్వారా తెలియ చేసిన పూనమ్ ధైర్యానికి బాలీవుడ్ ఆశ్చర్యపోతోంది. అయితే ఇది అంతా త్వరలో విడుదల కాబోతున్న తన సినిమా ‘నషా’ ప్రమోషన్ కోసమా అనే వారు లేకపోలేదు. ఎదిఎమైనా తాను కన్నెను కాను అంటూ ప్రకటించుకున్న పూనమ్ ధైర్యానికి బాలీవుడ్ ఆశ్చర్య పోతోంది...... 

మరింత సమాచారం తెలుసుకోండి: