మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించిన బ‌లుపు అత‌డి కెరీర్ కి మ‌లుపు అవుతుందా..?బ‌లుపు ఇండస్ట్రీ రికార్డ్స్ క్రాస్ చేస్తుందా..కాదు కాదు ర‌వితేజ సినిమా రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుందా...?ఔన‌నే అంటున్నారు రైట‌ర్ కోన‌వెంక‌ట్, డైరెక్టర్ హారిస్ శంక‌ర్.

నిజానికి ర‌వితేజ డబుల్ హ్యాట్రిక్ ప్లాప్స్ కొట్టిన త‌రువాత వ‌స్తోన్న చిత్రం బ‌లుపు. అందుకేనేమో ఇపుడు అంద‌రి ఫోక‌స్ ఈ సినిమాపైనే వుంది. ఈసారి  హిట్ కొట్టాడా ఇండ‌స్ట్రీలో వుంటాడు...లేదా బుల్లితెర‌పై రియాల్లీ షోస్ చేసుకుంటాడు అంటూ ర‌వితేజపై విమ‌ర్శలు వస్తోన్న వేళ బలుపుపై పాజిటివ్ టాక్ విన‌బ‌డుతోంది. ఇప్పటికే రిలీజైన ట్రైల‌ర్స్ , సాంగ్స్ గుడ్ టాక్ సొంతం చేసుకున్నాయి. గోపిచంద్ మలినేని టేకింగ్,   ర‌వితేజ మేన‌రిజానికి శృతిహాస‌న్, అంజ‌లిల గ్లామ‌ర్ ఎలాగూ ఓ ఎస్సెట్ అయ్యే అవ‌కాశం వుంది.  దీనికి తోడు ఇపుడు రైట‌ర్ కోన వెంక‌ట్ బ‌లుపుపై అంచ‌నాలు పంచేలా ట్వీట్స్ చేస్తున్నాడు. ఎవ‌రెన్ని అన్నా, ఏం మాట్లాడుకున్నా బ‌లుపు బాక్సాఫీస్ ద‌గ్గర బంప‌ర్ హిట్ అవుతుంద‌ని కోన‌వెంక‌ట్ ట్వీట్స్ మీద ట్వీట్స్ చేస్తున్నాడు.
��
విశేషం ఏంటంటే గబ్బర్ సింగ్ డైరెక్టర్ హారిస్ శంక‌ర కూడా ఈ మాన్సూన్ సీజ‌న్ మాస్ రాజా సీజ‌న్ అవుతుందంటూ ట్వీట్ చేశాడు.దీంతో బ‌లుపు హిట్ అవ్వడం ఖాయ‌మ‌ని ఇండ‌స్ట్రీ పీపుల్స్ అనుకుంటున్నారు. మ‌రి ఆడ‌యెన్స్ ఏమంటార‌న్నది ఈనెల 28న తేల‌నుంది. ఎందుకంటే ఆ రోజే బ‌లుపు రిలీజ్ మ‌రి.

మరింత సమాచారం తెలుసుకోండి: