హీరోకు స‌రిజోడి హ‌రోయిన్ దొరికితే, ఇక తెలుగు హీరోల ఫేసుల్లో ఆనందాన్ని ఆప‌లేము. తెలుగు ఇండ‌స్ట్రీలో ఉంటే పొడుగు ఉన్న హీరోయిన్స్‌కు పొట్టిగా ఉన్న హీరో వ‌స్తాడు, లేకుంటే పొడుగు హీరోల‌కు పొట్టిగా ఉన్న హీరోయిన్ ఉంటుంది. నిత్యామీన‌న్‌కు అందం ఉన్నా హైటు లేదు. త‌న అందం,అభిన‌యంతో ప్రేక్షకుల‌ను ఆక‌ట్టుకంటున్న నిత్యామీన‌న్ త‌న హైటు మీద దృష్టి పెట్టింది.

5.2 అడుగులు ఉన్న నిత్యామీన‌న్ ఏ హీరో స‌ర‌స‌న అంత‌గా సూట్ అవ‌డంలేదంట‌. నిత్యాపై ఇంట్రెస్ట్ ఉన్నా, హైట్‌తో ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయంట‌. ఈ విష‌యంపై దృష్టి పెట్టిన‌ నిత్యా, తాజాగా కేర‌ళ ట్రీట్‌మెంట్ తీసుకుంటుంద‌ట‌. త‌న నెక్స్ట్‌మూవీ శ‌ర్వానంద్‌తో ఏమిటో ఈ మాయ‌లో నిత్యా హైట్‌ను స్పష్టంగా చూడ‌వ‌చ్చంటున్నారు.

ఈ పొట్టి భామ పొడుగ‌యితే ఆ ట్రీట్‌మెంట్‌కు, ఈ బ్యూటీకూ రెండింటికి ఎంత‌గానో డిమాండ్ పెరిగిపోవ‌టం ఖాయం అని ఇండ‌స్ట్రీ తేల్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: