ప్రపంచ ప్రసిద్ది చెందిన రామోజీ ఫిల్మ్‌సిటీ ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో టాక్ ఆప్ ది టౌన్ అయింది. టాలీవుడ్‌కు రామోజీ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ అంతాగా ఉప‌యోగించుకోక‌పోయిన‌ప్పటి, ఆర్‌.ఎఫ్‌.సిను మాత్రం బాలీవుడ్ వాళ్లు బాగానే ఉప‌యోగించుకుంటున్నారు.

బాలీవుడ్ ప్రొడ‌క్షన్స్ హౌస్‌ల‌న్ని ఆర్‌.ఎప్‌.సి వైపే మొగ్గుచూపుతున్నారు. ఈ మ‌ధ్య బ్లాక్‌బ‌స్టర్‌గా నిలిచిన బాలీవుడ్ మూవీల‌న్నీ ఇందులో షూటింగ్ జ‌రుపుకున్నవే. ఫారిఫ్ ట్రిప్‌ల‌కు ఖ‌ర్చు ఎక్కువుగా పెట్టే బాలీవుడ్‌కు ఆర్‌.ఎఫ్‌.సి కొండంత అండగా నిలుస్తుందంట‌. కిలాడి,చెన్నై ఎక్స్‌ప్రెస్‌,హిమ్మత్‌వాల‌,ఎబిసిడి,ఆషికి, స్పెష‌ల్ 26, ఛ‌ష్మే బ‌ద్ధూర్ ఇంకా ఎన్నో మూవీలు ఆర్‌.ఎప్‌.సిలో షూటింగ్ చేయ‌టానికే ప్రాముఖ్యత చూపిస్తుంది.

బాలీవుడ్ హీరోయిన్స్‌,ఐటెం గ‌ర్ల్స్ అంటూ అంద‌రూ హైద‌రాబాద్‌కు రావ‌డంతో, టాలీవుడ్ ప్రొడ్యూజ‌ర్స్ అండ్ డైరెక్టర్స్‌కు బాగా క‌లిసివ‌స్తుంది. బాలీవుడ్ బ‌డా హీరోయిన్స్‌ను టాలీవుడ్‌లో ఒప్పించేందుకు వాళ్లికిదే మంచి స‌మ‌యం అని తెగ ఆనంద‌పుడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: