స్టార్ హీరో సినిమాలంటే స్టార్ కమెడియన్స్ ఉండితీరాలి అన్న నమ్మకంతో హీరోలతో సమానంగా భారీ పారితోషికాలు ఇస్తూ స్టార్ కమెడియన్స్ బ్రహ్మనందం ఎమ్.ఎస్.నారాయణ,అలీలను బుక్ చేసుకుంటూ, హీరోలతో సమానంగా ఆ సినిమాల పబ్లిసిటి లో ఎలివేట్ చేస్తున్నారు. కానీ ఈ సంవత్సరం బడా బడ్జెట్ లతో, భారీ సినిమాలుగా విడుదల అయిన ‘బాదుషా’, ‘ఇద్దరమ్మాయిలతో’, సంధింగ్ సంధింగ్’ లాంటి సినిమాలలో బ్రహ్మనందం కామెడి ట్రాక్ ను స్పెషల్ గా ఎలివేట్ చేసినా ఆయన ఈ సినిమాలకోసం తీసుకున్న భారీ పారితో షికాలతో పోలిస్తే ఆసినిమా సక్సస్ అంతంత మాత్రమే.

హాస్య నటులను ఆదరించే సంస్కృతి మన తెలుగు ప్రేక్షకులకు విపరీతంగా ఉంది. స్టార్ కమెడియన్స్ మాత్రమే అవ్వక్కరలేదు, ఎవ్వరు బాగా నవ్వించినా మన తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు. దీనికి ఉదాహరణగా భ్రహ్మనందం, ఎమ్.ఎస్.నారాయణ లాంటి స్టార్ కమెడియన్స్ లేకుండా సూపర్ హిట్ అయిన ‘గుండెజారి గల్లంతైయ్యిoదే' ‘స్వామిరారా’ ప్రేమ కధా చిత్రమ్’ సినిమాలను చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ మధ్యనే విడుదలై సంచలన విజయం సాధించిన ‘ప్రేమ కధా చిత్రమ్‘ సినిమాలో కమెడియన్స్ గా నటించిన ప్రవీణ్, సప్తగిరి ల నటనకు నవ్వులతో దీయేటర్లు అధిరిపోతున్నాయి. అలాగే ‘గుండెజారి గల్లంతైయ్యిందే’ సినిమాలో మధునందన్ ‘స్వామిరారా’ సినిమాలో కమెడియన్ సూర్య హాస్య ప్రతిభకు ఫిదా అయిపోయారు.

అలాగే చాలా సినిమాలలో తన నటనతో నవ్విస్తున్న వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్ లగురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ పరిస్థితులలో స్టార్ కమెడియన్స్ ఉంటేనే సినిమాలు విజయవంతం అవుతాయి అన్న నమ్మకం నుంచి మన టాలీవుడ్ నిర్మాతలు దర్శకులు బయట పడుతున్నారట. ఈ పరిస్థితి మరికొంతకాలం కొనసాగితే కమెడియన్స్ హవాకు ముఖ్యంగా టాప్ కమెడియన్ బ్రహ్మి కి చెక్ పడబోతోందని అనుకోవాలని టాలీవుడ్ టాక్....  

మరింత సమాచారం తెలుసుకోండి: