సినీనటి కుష్బూ ఖుషీగా ఖుషీగా ఉంది. పెళ్లికి ముందు శృంగారంపై మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై సంబరపడిపోతోంది. తాళి కడితేనే పెళ్లి కాదు.. ఓ యువతితో శారీరక సంబంధం పెట్టుకుని సహజీవనం చేస్తే పెళ్లైపోయినట్లే లెక్క. ఇందులో తిరుగులేదు. తప్పించుకునే అవకాశం లేదంటూ మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యల్ని కుష్బూ గతంలో తాను చేసిన స్టేటిమెంట్స్ కు అనుకూలంగా మార్చేసుకొంది. నేను అప్పుడు చెబితే తప్పున్నారు. మరి ఇప్పుడు కోర్టు చేసిన వ్యాఖ్యలపై ఏమంటారంటూ కళ్లెగరేస్తోంది.

హైకోర్టు పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేసిన విషయంలో తీర్పిస్తే.. పెళ్లికి ముందు శృంగారం తప్పుకాదనే వ్యాఖ్యలకి కుష్బూ వాటిని అన్వయించుకొంది. కుష్బూ ఇంతా హంగామా చేయడం వెనక కారణం రాజకీయాలే. పాలిటిక్సంటే యమా ఆసక్తున్న కుష్బూ ఈ ఇంట్రెస్ట్ తోనే తమిళనాడులో ఉన్న ప్రధాన పార్టీల్లోకి కప్పగెంతులేసింది. అన్నాడీఎంకే నుంచి డీఎంకేలోకి జంపై జయలలితను విమర్శిస్తూ పొలిటికల్‌ మైలేజీ పెంచుకొనే యత్నాలు చేసిన కుష్బూ.. డీఎంకే వారసత్వం విషయంలో స్టాలిన్ కు వ్యతిరేకంగా మాట్లాడి ఆ పార్టీ కార్యకర్తల ఆగ్రహం చవిచూసింది.

చక్రం తిప్పాలనీ..

అయినా సరే సమాజంలో జరిగే సంఘటనలపై తన వంతు బాధ్యతగా ఆవేశంగా స్పందించే కుష్బూ ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లడం మాత్రం మానదు. ఎందుకు అంటే తానో సోషల్ యాక్టివిస్ట్ నని.. తప్పు జరిగినప్పుడు దానిపై స్పందించడం తన అలవాటని.. దాన్ని ఎవరూ ఆపలేరు.. మార్చలేరంటూ డైలాగ్స్ కొడుతుంది. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసినా.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేసినా కారణం ఇదేనని చెబుతుంది. అయితే ఓ వైపు సీరియల్స్.. మరోవైపు రియాల్టీ షోలంటూ బుల్లితెరపై హంగామా చేస్తూ సూపర్ ఫామ్ లో ఉన్న కుష్బూ తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఎప్పట్నుంచో భావిస్తుందనే ప్రచారముంది.

అందుకే ఏ ఇన్సిడెంట్ జరిగినా.. తనకనుకూలంగా మార్చుకొనే యత్నం చేస్తుంటుందని తమిళనాడులో వినిపిస్తుంటుంది. మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యల్ని తన స్టేటిమెంట్స్ కు అనుకూలంగా మార్చుకోవడం వెనకున్న ఉద్దేశం కూడా ఇదేనని అరవ రాజకీయాల్లో ప్రచారం జరుగుతుంది. మరి ప్రస్తుతానికి డీఎంకేలో కీ పోస్ట్ లో ఉన్న కుష్బూ.. ఆ పార్టీలోనే ఏదో ఒక స్థానంతో సరిపెట్టుకుంటుందా...! లేక సామాజిక కార్యకర్త అవతారమొత్తి తన పొలిటికల్ ఇమేజ్ ని మరింత పెంచుకొనే యత్నాలు చేస్తుందా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: