తెలుగు ఇండ‌స్ట్రీలో ఇంత‌టి దారుణ‌మైన ప‌రిస్థితి ఇప్పటి వ‌ర‌కూ ఎదురుకాలేదు. వారానికి రెండు మూవీల‌తో ఇండ‌స్ట్రీలో అడ‌ల్డ్ కంటెంట్ హారోత్తుతుంది.పెద్ద హీరోల‌పై యూత్‌కు ఎంత‌టి ఇంట్రెస్ట్ క‌లుగుతుందో, చిన్న మూవీల‌పై కూడ అంతే ఇంట్రెస్ట్‌ను చూపిస్తున్నారు.దీనివల్ల యువ‌త పెడ‌దోవ‌లో ప‌డుతుంది.
ఇదే బాధ‌ను పిల్లల పేరెంట్స్ ఫిల్మ్‌ఛాంబ‌ర్ వ‌ద్ద గ‌ళం వినిపించ‌డానికి రెడీ అయ్యారు. మ‌రి కొద్ది రోజుల్లో కళాశాల సంఘూల ప్రతినిధులు,పేరెంట్స్ మూకుమ్మడిగా ఫిల్మ్‌న‌గ‌ర్‌లో దీక్షలు చేసే అవ‌కాశం ఉంద‌ని తాజా స‌మాచారం.

రొచ్చు టైటిల్లో,బూతు మాట‌ల‌తో, డ‌బుల్ మీనింగ్ వాక్యాల‌ను ఇబ్బడిముబ్బడి సినిమాల్లో జొప్పిస్తున్నార‌ని, వీటిని నిరోదించాలి ల‌క్ష్యంగా ఈ దీక్షకొన‌సాగిస్తామ‌ని విద్యార్ధి త‌ల్లిదండ్రులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: