మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పవన్ కాంబినేషన్ లో రూపొందుతున్న ‘అత్తారింటికి దారేది’ సినిమా షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్ లో జరుగుతోంది.  పంచ్ డైలాగ్స్ తో పాటు యాక్షన్ సీన్స్ కు ప్రాధాన్యత నిచ్చే త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీన్ కోసమే ఈ సినిమాలో రెండు కోట్లు ఖర్చు పెట్టి ఈ సినిమా ఇమేజ్ ను మరింత పెంచేసాడు.

ఇంతవరకు బాగానే ఉంది కానీ ప్రస్తుతం ఈ సినిమాకు ఇక్కడే సమస్య వచ్చి పడింది. అదేమిటంటే పర్ఫెక్షనిస్ట్ గా పెరున్న త్రివిక్రమ్ ఈ సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నెమ్మదిగా తీస్తూఉండటం తో ఈ సినిమా నిర్మాతకు కష్టాలు వచ్చి పడుతున్నాయాట. ఇప్పటికే ఈ సినిమా ఆగస్టు 7న రిలీజ్ అవుతుంది అని ప్రకటన చేసిన నేపధ్యంలో ఆనేలలో రాబోతున్న రంజాన్, ఆగస్టు 15ను పండుగుల రీత్యా భారీ కలెక్షన్స్ వస్తయాన్న ఆశతో ఇప్పటికే ఫస్ట్ లుక్ కూడా విడుదల కాకుండానే 70కోట్ల పైన బిజినెస్ ఐపోయింది .

అందువల్ల ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నడుస్తున్న నత్త నడక చూస్తుంటే ఆగస్టు 7న ఈ సినిమా రిలీజ్ అయ్యేనా అనే అనుమానం యూనిట్ మెంబర్స్ కే కలుగుతోంది. కేవలం ఇంకా 40 రోజులు మాత్రమే మిగిలి ఉన్న ఈ పరిస్థితులలో ఈ సినిమా విడుదల తేదీ వాయిదాపడితే బయ్యర్లు తీవ్రంగా నష్ట పోతామని గ్రహించి నిర్మాత పై తీవ్రమైన వత్తిడి తెస్తున్నారట. అందువల్ల నిర్మాత కూడా త్రివిక్రమ్ పై వత్తిడి చేస్తున్నా త్రివిక్రమ్ మాత్రం తన సహజ సిద్దమైన స్వీట్ స్మైల్ తో ఈ సినిమాను నెమ్మదిగానే చేక్కుతున్నాడని టాక్...అనుకున్నట్లుగా ఈ సినిమా ఆగస్టు 7న విడుదల కాకపోతే బిజినెస్ రీత్యా పవన్ సినిమా అత్తారింటికి దారేది ప్రమాదపు అంచున ఉన్నట్లే లెక్క...

మరింత సమాచారం తెలుసుకోండి: