అప‌రిచితుడులో ప్రకాష్ రాజ్ ఓ డైలాగ్ చెబుతాడు...నేను ర‌జనీని చూశా..క‌మ‌ల్ ని చూశా..అమితాబ్ ని చూశా అమీర్ నీ చూశా..అంద‌ర్ని క‌ల‌గ‌లిపి ఒకేసారి చూపిస్తున్నావ్ ఎంట్రా నువ్వు అని. య‌స్.. పాత్ర కోసం ఏదైనా చేయ‌గ‌ల హీరో విక్రమ్. క‌మ‌ల్ త‌రువాత మ‌ళ్లీ పాత్ర కోసం ప్రాణాలు తీసుకోనేంత పిచ్చి వున్న వ‌న్ అండ్ ఓన్లీ హీరో విక్రమ్. నిజానికి సినిమా సినిమాకు న‌ట‌న‌లో వేరేష‌న్ విక్రమ్ కే సాద్యం. సేతులో యారోగెంట్ గా క‌నిపించి ఔరా అనిపించాడు. ఇక శివ‌పుత్రుడులో అయితే శ్మశానం త‌ప్ప మ‌రే ప్రపంచం తెలియ‌ని వ్యక్తిగా అద‌రొట్టి నేష‌నల్ అవార్డ్ కూడా కొల్లగొట్టాడు. అప‌రిచితుడు,మ‌ల్లన్న, నాన్న సినిమా ఏదైనా విక్రమ్ త‌నదైన ముద్ర వేస్తాడు. అందుకే మాస్ ఆడియెన్స్ విక్రమ్ అంటే ప‌డిచ‌స్తారు.

ఇక ప్రస్తుతం శంక‌ర్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఐ సినిమా కోసం కూడా విక్రమ్ ఇదే సాహ‌సాలు చేశాడ‌ట‌. ఇంకా చెప్పాలంటే సాహ‌సాలు చేసి ప్రాణాల‌మీదికి తెచ్చుకున్నాడ‌ట‌. డిఫ‌రెంట్ స్టోరితో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో విక్రమ్ ప‌దిర‌కాల పాత్రలు చేస్తున్నాడ‌ట‌.. ర‌క‌ర‌కాల‌ గెట‌ప్స్ లో క‌నిపిస్తాడ‌ట‌., ఉంగ‌రాలు జుట్టుతో, టోపితో, కళ్లదాల‌తో, పోలం దున్నుతూ, కాలేజ్ బోయ్ గా ఇలా ర‌క‌ర‌కాల గెట‌ప్స్ తో ఇప్పటికే కొన్ని స్టిల్స్ బ‌య‌టికి వ‌చ్చాయి. విశేషం ఏంటంటే ప్రతి గెట‌ప్ కి డిఫ‌రెన్స్ క‌నిపిస్తోంది.

చెప్పుకోవాల్సిన మ‌రో విష‌యం ఏంటంటే విక్రమ్ ఈ సినిమా కోసం 25 కేజీలు బ‌రువు త‌గ్గాడ‌ట‌. పాత్ర పాత్రకి బ‌రువు పెరుగుతూ త‌గ్గుతూ వ‌చ్చేస‌రికీ అనారోగ్యం పాలైయ్యాడు..ఇక డైట్ ఆపేయండి లేదంటే చ‌స్తారు అని డాక్టర్ హెచ్చరించాడ‌ట‌. అయినా మొండి విక్రమ్ అదే సాహ‌సం చేశాడు.. ఎలాగైతేనేం అనుకున్నది సాదించాడు విక్రమ్. నిజానికి క్యార‌క్టర్ కోసం ప్రాణాలు సైతం ప‌ణంగా పెట్టే ఈ ల‌క్షణ‌మే...ఈ డెడికేష‌న్ న‌చ్చే ఎంత‌మంది హీరోలు త‌న సినిమాలో న‌టించ‌డానికి క్యూలో వున్నా మ‌ళ్లీ విక్రమ్ కే ఛాన్స్ ఇచ్చాడు గ్రేట్ డైరెక్టర్ శంక‌ర్. ఇక తెలుగులో మ‌నోహారుడుగా రాబోతున్న ఈ సినిమాలో విక్రమ్ కి జోడిగా అమీ జాక్సన్ న‌టించింది. దాదాపు 150 కోట్లతో మూడు భాష‌ల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విక్రమ్ డిఫ‌రెంట్ గెట‌ప్స్ చూడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: