ర‌చ్చ త‌ర‌వాత ఏడాది ఖాళీగా ఉన్నాడు సంప‌త్‌నంది. ఇప్పుడు వ‌వ‌న్ క‌ల్యాణ్‌తో సినిమా పేరుచెప్పి కాస్తో కూస్తో క్రేజ్ తెచ్చుకొన్నాడు. పుట్టిన రోజుల‌కు పేప‌ర్లో ఇంట‌ర్వ్యూలు కూడా ఇచ్చుకొంటున్నాడు. గ‌బ్బ‌ర్‌సింగ్ 2ని హిట్ చేయ‌డం ఖాయం... అని డంకాబ‌నాయించి చెబుతున్నాడు. ర‌చ్చ సినిమాకి సంప‌త్ చేసింది ఏమీ లేద‌ని ప‌రిశ్రమ వ‌ర్గాల టాక్! రామ్‌చ‌ర‌ణ్ కాళ్లూ, చేతులూ పెట్టి - ఆ సినిమాని త‌న‌కు కావ‌ల్సిన‌ట్టు తీర్చిదిద్దుకొన్నాడ‌ట‌.

ఆ సినిమా క‌మ‌ర్షియల్‌గా ఆడేసింది గానీ - గొప్ప క‌ళాఖండం కాదు.. అని స్వ‌యంగా సంప‌త్‌నందినే చెప్పుకొన్నాడు. ఇప్పుడు ప‌వ‌న్ సినిమాని ఎలా టేక‌ప్ చేస్తాడు??  అనే అనుమానం అటు ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్లో, ఇటు ప‌వ‌న్ అభిమానుల్లోనూ ఉంది. గ‌బ్బ‌ర్‌సింగ్‌.. ప‌వ‌న్ క్రేజ్‌ని మరింత పెంచిన సినిమా. అయితే.. ఆ సినిమా కోసం హ‌రీష్‌శంక‌ర్ ప‌డిన క‌ష్టాన్నీ, చూపించిన ప్ర‌తిభ‌నూ త‌క్కువ అంచ‌నా వేయ‌కూడ‌దు. ప‌వ‌న్ ఇమేజ్‌ని దృష్టిలో ఉంచుకొని స‌న్నివేశాలు రాసుకొన్నాడు. సంభాష‌ణ‌లు రాసుకొన్న స‌త్తా ఉన్న‌వాడు కాబ‌ట్టి- ప్ర‌తి సన్నివేశాన్ని పండించాడు.

��

మ‌రి.. హ‌రిష్ శంక‌ర్‌లో ఉన్న టాలెంట్‌... సంప‌త్‌లో ఉందా? అనేది అనుమాన‌మే. సీక్వెల్ సినిమాలు హిట్ అయిన సంద‌ర్భాలూ త‌క్కువే. అలాంట‌ప్పుడు లో ప్రొఫెల్‌లో ఉండాల్సింది పోయి... సినిమా సూప‌ర్ హిట్‌, బంప‌ర్ హిట్.. అంటూ స్టేట్‌మెంట్‌లు ఇవ్వ‌డం ఎందుకు?  పైగా ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకే వెళ్ల‌లేదు. ఇది నిజంగా సంప‌త్ ఓవ‌ర్ కాన్ఫిడెన్సే అని ప‌వ‌న్ ఫ్యాన్స్ సైతం అభిప్రాయ ప‌డుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: