మంచు విష్ణు ‘దేనికైనా రెడీ’ తర్వాత తను చేయబోయే సినిమా కామెడీ సబ్జెక్ట్ నే ఎంచుకున్నాడు. తనకు కలిసివచ్చన హన్సిక నే హీరోయిన్ గా ఎంచు కున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది కానీ తను నిర్మిస్తున్న సినిమా హిందీ సినిమా రీమేక్ అన్న విషయం తెలిసినా ఆ సినిమా పేరు మాత్రం ఎవ్వరికీ చెప్పకుండా దాచి పెట్టేశాడు. చివరకు హీరో మోహన్ బాబు కూడా ఈ సినిమా హిందీ లో ఒక విజయవంతమైన సినిమాకు రీమేక్ అంటూ మాటలు చెప్పాడు కానీ ఈ సినిమా పేరు చెప్పలేదు.

అయితే ఈ చిత్ర కధానాయక హన్సిక మాత్రం ఈ విషయం తెలియక అనుకోవాలి తాను ప్రస్తుతం విష్ణు తో చేస్తున్న సినిమా ‘గోల్ మల్ 3’ కి రీమేక్ అంటూ అమాయకంగా చెప్పేసింది. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనీ, చాలామంది అనుకున్నా ఎందుకో మన హీరోలు ఈ సినిమా పై దృష్టి పెట్టలేదు. చివరకు విష్ణు ఈ స్క్రిప్ట్ ని ఎంచుకున్నాడు. కానీ ఈ సినిమా పేరును విష్ణు ఎందుకు దాచాడు అన్నది ఎవరికీ అర్ధం కానీ ప్రశ్న.

మరొక విషయం ఏమిటంటే గతంలో విష్ణు చేసిన హిందీ రీమేక్ లు తెలుగులో పెద్దగా సక్సస్ కాలేదు, ఈ సెంటిమెంట్ రీత్యా కాబోలు ఈ సినిమా పేరును దాచి ఉంటాడని అంటున్నారు. ఈ విషయాలు తెలియక పాపం హన్సిక లీక్ చేసి ఉంటుంది. ఏసంగతి ఎలా ఉన్నా మంచు వారి గుట్టురట్టు చేసింది హన్సిక....

మరింత సమాచారం తెలుసుకోండి: