అల్లరి నరేష్ హీరో కదా కామెడీతో ఇరగదీస్థాడు అని ఎవరైనా యాక్షన్-3డి సినిమాకు వెలితే నిలువునా మునిగినట్టే. కారణం సినిమాల్లో నరేష్ హీరోనే అయినా ఈసినిమాలో మాత్రం కాదు, నలుగురు నటులను ప్రధానపాత్రలుగా పెట్టి తీసిన ఈ సినిమాలో పాత్ర, నటన పరంగా చూసుకున్నా కూడా అల్లరి నరేష్ నాలుగో స్థానంలో నిలచి ఇప్పటి దాకా తనకు ఉన్న ఇమేజీని గంగలో కలుపుకున్నాడు.

ఇంగ్లీష్, హింది సినిమాలు అస్సలు చూడడం అలవాటులేని వారు ఈసినిమాను మరీ కష్టంగా కాకుండా కాస్థా భరిస్థూ చూస్థారు. అక్కడక్కడా కామెడీ సీన్లు అదరగొట్టినా అవి ఇంతకు ముందే హాంగోవర్ అనే హాలివుడ్ సినిమాలో, డమాల్ అనే హింది సినిమాలోనివి సేమ్ టు సేమ్ పెట్టి కేవలం నటులను భాషను మాత్రమే మార్చి చెత్తచెత్త చేసారు. బ్రహ్మానందం, సునీల్, ఎంఎస్ నారాయణ, పోసాని వంటి వారిని పెట్టి కూడా వారికి తగిన పాత్రలు, సన్నివేశాలు పెట్టకు కామెడీనీ గంగలో కలిపారు. ఓవరాల్ గా సినిమాలో హీరో లేకపోయినప్పటికి హీరోలా అందరు బావించే అల్లరి నరేష్ కోసం ఒక హీరోయిన్ పెట్టి సినిమాలో కథ కోసం కాకుండా సృతిమించిన ఎక్స్ పోజింగ్ కోసమే పెట్టి కుటుంబసమేతంగా చూడాలంటే కూడా కాస్థా భయపడేలా తీసారు సినిమాను.

ఎక్కడా ట్విస్టులు లేకుండా, దొంగతనమైనా, సస్పెన్స్ గా ఉండాల్సిన సన్నివేశాలైనా పెట్టే అవకాశం ఉన్నప్పటికి అవేమిలేకుండా తీసి తుస్సుమనిపించారు. క్లయిమాక్స్ లో అవసరం లేని ఫైట్ ను అల్లరి నరేష్ హీరోయిజం కోసమే పెట్టినట్టున్నారు తప్ప ఆసినిమాకు అక్కడ అంత ఫైట్ పెట్టాల్సిన పనిలేదు. నిజానికి ఈసీన్ తో సినిమా అయిపోతుంది, కాని మళ్లీ లాగించి, ఓ పాట, ఓ పెళ్లి తతంగం పెట్టి సాగదీసి సావగొట్టారు. నిజానికి చెప్పాలంటే అల్లరి నరేష్ తనకు తానే నవ్వుల పాలు చేసుకున్న సినిమా. స్వాతిముత్యపు ఝల్లులలో అన్న పాటను మాత్రం ప్రేక్షకులు కాస్థా ఎంజాయ్ చేస్థారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: