సినిమాలలో అవకాశలకోసం తమ క్రేజ్ ను అభిమానుల మధ్య నిలుపుకోవడం కోసం హీరోయిన్స్ రకరకాల ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటారు. టాలెంట్ ఉన్నాటాలీవుడ్ లో ఫేడ్ అయిపోయిన కథానాయిక  ప్రియమణి.తెలుగు, తమిళ , మలయాళ సినిమాలు అన్ని చుట్టేసినా పెద్దగా ఎక్కడా ఈ మెకు కలిసి రాలేదు. జాతీయ స్థాయిలో ఉత్తమ నటి గా అవార్డు పొందిన  ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఖాళీ గా ఉండటం తో ఏదో విధం గా  బాలీవుడ్ లో పాగా వేయాలని బాలీవుడ్ ఫై దృష్టి పెట్టి   షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న "చెన్నై ఎక్స్ ప్రెస్"లో ఓ ప్రత్యేక గీతం చేసింది.

 ఆ పాట ఇటీవలే బయటకొచ్చింది. దక్షిణాది తరహాలో మసాలా దట్టించిన ఆ గీతంలో ప్రియమణి అందాల ఆరబోత అదిరి పోయింది. ఈ గుర్తింపును ఎలాగైనా సద్వినియోగం చేసుకోవాలని చూస్తోంది ప్రియమణి. అందుకే కొత్తగా ప్రేమ కబుర్లు వినిపిస్తోంది. తన ట్విట్టర్ ని వేదికగా చేసుకుని సంచలనాత్మక  రీతిలో సందేశాలు పంపుతోంది. "పాటకు వస్తున్న స్పందన చాలా బాగుంది. షారుఖ్ థాంక్స్ ఫర్ డేటింగ్" అంటూ ట్వీట్ చేసింది. షారుఖ్ ఏంటి? డేటింగ్ ఏంటి? అని అందరూ అడిగేలోపుగానే "సారీ... థాంక్స్ ఫర్ డాన్సింగ్ విత్ మీ" అంటూ మరో ట్వీట్ పంపింది .

 ఏదో విధం గా  ఓ సంచలనంతో వార్తల్లో నిలవాలనే ప్రయత్నంలో ఉంది ప్రియమణి. అందుకే తన ట్విట్టర్ సందేశాలను సాధనం గా ఎంచుకుంది . ప్రయత్నం బాగుంది కానీ ఈ అతి ఆమెకు క్రేజ్ తెచ్చిపెడుతుం దో లేదో చూడాలి. .. ...

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: